Sajjan Jindal: దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి లేని లోటు ఎవరూ పూడ్చలేనిది అన్నారు జిందాల్ చైర్మన్ సంజ్జన్ జిందాల్.. కడప జిల్లా సున్నపురాళ్ళపల్లిలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్స్‌కు ఈ రోజు సీఎం వైఎస్ జగన్‌తో కలిసి భూమి పూజ చేశారు జిందాల్ చైర్మన్ సజ్జన్ జిందాల్.. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, మంత్రి అమర్నాథ్ రెడ్డి, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిందాల్ కొత్త పరిశ్రమ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు.. వైఎస్ఆర్ జిల్లాలో వైఎస్ లేని లోటును ఎవరూ పూడ్చలేనిదన్న ఆయన.. 15 ఏళ్ల క్రితం వైఎస్ తో నాకు ఎంతో సన్నిహిత సంబంధాలు ఉండేవని గుర్తుచేసుకున్నారు.. ఆ రోజుల్లోనే వైఎస్ పరిశ్రమ ఏర్పాటు గురించి చెప్పేవారని తెలిపారు.
Read Also: Kadapa Steel Plant: నాన్నగారి కల నిజం అవుతుంది.. ఈ ప్రాంతమంతా అభివృద్ధి..!
ఇక, సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై ప్రశంసలు కురిపించారు సంజ్జన్ జిందాల్.. సీఎం జగన్ నాయకత్వంపై, అభివృద్ధిపై ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా చర్చించుకుంటున్నారని.. నిబద్ధతతో, అకుంఠిత దీక్షతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారు.. మెడికల్ పరంగా, పోర్టుల ఆధునీకరణ, ఇతర రంగాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల సహకారంలో ముందుకు వెళ్తున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో ఈ స్టీల్ పరిశ్రమను 25 మిలియన్ టన్నుల ఉత్పత్తి స్థాయికి తీసుకెళ్తామని ప్రకటించారు. ఇది పరిశ్రమ నిర్మాణానికి పునాది రాయి కాదు. ఇది మొత్తం కడప జిల్లా అభివృద్ధికి పునాది రాయిగా అభివర్ణించారు. ఒకప్పుడు రాయలసీమలో భాగమైన బళ్లారిలో కూడా జిందాల్ పరిశ్రమ పెట్టాక ఇలాగే జరిగిందన్నారు. మహారాష్ట్రలో కూడా స్టీల్ ప్లాంట్ ఏర్పాటులో సమూల మార్పులు వచ్చాయి.. ఎంతో అభివృద్ధి జరిగిందని.. కడప జిల్లాలో కూడా ఊహించని అభివృద్ధిని ఆశిస్తున్నామని తెలిపారు జిందాల్ చైర్మన్ సంజ్జన్ జిందాల్.