Site icon NTV Telugu

JC Prabhakar Reddy: నీ విగ్రహాల ఏర్పాటుకు నిరాకరించే వారికి నిద్ర లేకుండా చేయిస్వామి..!

Jc Prabhakar Reddy

Jc Prabhakar Reddy

వినాయక చవితి వచ్చేసింది.. ఇప్పటికే గల్లీలు, విధులు, ఊరు, వాడ అనే తేడా లేకుండా గణేష్‌ మండపాలు వెలుస్తున్నాయి.. మరికొన్ని చోట్ల.. మండపాల ఏర్పాటుకు, విగ్రహాలు పెట్టేందుకు అధికారులు, పోలీస్‌ స్టేషన్ల చుట్టూ అనుమతుల కోసం తిరాగాల్సిన పరిస్థితి ఉంది.. ఈ పరిణామాలపై తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌ రెడ్డి కాస్త సీరియస్‌గా స్పందించారు.. నీ విగ్రహాల ఏర్పాటుకు నిరాకరించే వారికి నిద్ర లేకుండా చేయిస్వామి అంటూ ఆ గణపతిని వేడుకున్నాడు.. ఏ విషయంపైనానా ముక్కుసూటిగా, కుండ బద్దలు కొట్టినట్టుగా మాట్లాడే జేసీ ప్రభాకర్‌రెడ్డి.. తాడిపత్రి ప్రజలు సంతోషంగా ఉండడం ఇష్టం లేదా? అంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు దయ దక్షిణాలతో హిందూవుల పండుగలు నిర్వహించుకోవాలా..? అని ప్రశ్నించారు.

Read Also: Dokka Manikya Vara Prasad: తాడికొండ వివాదం.. ఎమ్మెల్సీ మాణిక్యవరప్రసాద్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..

గణేష్‌ విగ్రహాల ఏర్పాటు అనుమతుల కోసం గంటల తరబడి నిరీక్షణ ఎందుకు? అని ప్రశ్నించారు జేసీ ప్రభాకర్‌ రెడ్డి.. విగ్రహాల అనుమతి నిరాకరణతో వారి పతనం మొదలైందని శాపనార్థాలు పెట్టిన ఆయన… శాంతి భద్రతల పేరుతో విగ్రహాల ఏర్పాటు అనుమతి నిరాకరణ సరికాదని హితవు పలికారు.. మున్సిపల్ చైర్మన్ అయిన నాకే అనుమతి కోసం అధికారులు చుట్టూ తిరిగే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.. ఇక, విగ్రహాల ఏర్పాటు నిరాకరించే వారికి నిద్ర లేకుండా చేయాలి స్వామి అంటూ ఆ వినాయకుడిని వేడుకున్నారు తెలుగుదేశం పార్టీ నేత, తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి. కాగా, కొన్ని ప్రాంతాల్లో మండపాల ఏర్పాటుకు అధికారులు అనుమతులు ఇవ్వడంలేదని.. భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. శాంతిభద్రతల సమస్యను సాకుగా చూపుతూ.. విగ్రహాలు ఏర్పాటు చేయకుండా అడ్డుకుంటున్నారని మండిపడుతున్నారు.

Exit mobile version