Site icon NTV Telugu

ఏ మత ధర్మంపై జగన్‌కు విశ్వాసం లేదు: జవహర్‌ రెడ్డి

ఏపీ మాజీ మంత్రి జవహర్‌ రెడ్డి జగన్‌ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా జవహర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఏపీ సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి క్రైస్తవుడు కాదని, క్రైస్తవుడు అని చెప్పుకుంటూ క్రైస్తవాన్ని అపహాస్యం చేస్తున్నాడన్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా జగన్‌ పరిపాలన కొనసాగుతుందని విమర్శించారు. ఏ మతం ధర్మం మీద కూడా జగన్ కి విశ్వాసం లేదని ఆయన అన్నారు. ముస్లింలకి షాదీ ముబారక్ లేదన్నారు.

Read Also: పీఆర్సీ బ్రహ్మ పదార్థంగా మారింది: సూర్యనారాయణ

బ్రింగ్‌ బ్యాక్‌ బాబు అని నినాదంతో మనం ముందుకెళ్లాలన్నారు. చంద్రబాబు నాయుడు పరిపాలనలోనే అన్ని కులాల వారికి అన్ని మతాల వారికి సమన్యాయం జరుగుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల కుప్పగా తయారైందన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. 20 ఏళ్లు వెనుకబడిన ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే తిరిగి బాబును ముఖ్యమంత్రి చేయాలని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

Exit mobile version