ఏపీలో రోడ్ల దుస్థితిపై తనవంతు పోరాటం చేస్తోంది జనసేన పార్టీ. సోషల్ మీడియా ద్వారా ఇప్పటికే భారీ ఎత్తున ప్రచారం చేపట్టింది. జనసేన నేతలు రోడ్లను పూడ్చారు. కానీ మళ్లీ వానలు రావడంతో రహదారుల దుస్థితి అధ్వాన్నంగా తయారైంది. పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ మండలం రామన్నపాలెం లో ఎంపీటీసీ మోఖమట్ల కృష్ణ కాంత్ ఆధ్వర్యంలో మన రోడ్డు మన హక్కు నినాదంతో వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. జనసైనికులు బురద , వర్షపు నీటితో నిండిన రోడ్డు గుంతలలో వరి నాట్లు వేసి..కాగితం పడవలు వదిలి నిరసన తెలిపారు.
Dwarf Couple: అర్థరాత్రి వీళ్లు చేసిన సాహసానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే!
ఈ సందర్భంగా జనసైనికులు మాట్లాడుతూ రోడ్ల దుస్థితి చూస్తే చాలా దయనీయంగా తయారయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సరైన రోడ్డులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను స్థానిక ఎమ్మెల్యే నెరవేర్చలేని పరిస్థితి ఉందని మండిపడ్డారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని, తక్షణమే రోడ్డు నిర్మాణం చేపట్టాలని జనసేన నేతలు డిమాండ్ చేసారు.ఈ కార్యక్రమంలో పెనుగొండ మండల జనసేన అధ్యక్షులు కంబాల బాబులు, జన సైనికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Latest Crime News: విమానంలో ఆ మద్యం వద్దన్నందుకు అటెండర్‌ను రక్తం కారేలా కొట్టిన ప్రయాణికుడు