మురమళ్ల సభలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది జనసేన పార్టీ… సీఎం వైఎస్ జగన్‌పై కౌంటర్ ఎటాక్‌కు దిగారు ఆ పార్టీ నేతలు.. సీఎం జగన్ ఈ రాష్ట్రానికి ఉత్తుత్తి పుత్రుడు అంటూ సెటైర్లు వేశారు కాకినాడ జిల్లా జనసేన అధ్యక్షుడు కందుల దుర్గేష్.. రాజకీయ విమర్శలు చేయడానికే సీఎం జిల్లాకు వచ్చారని దుయ్యబట్టిన ఆయన.. విద్యుత్ ఉద్యోగులకు 13వ తేదీ వరకు జీతాలు ఇవ్వలేదు.. వాటి సంగతి చూడండి అని సలహాఇచ్చారు.. ఇక, జగన్ బినామీ సంస్థ టర్న్ కీ ద్వారా రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని ఆరోపణలు చేశారు కందుల దుర్గేష్.
Read Also: Breaking: త్రిపుర సీఎం రాజీనామా.. బీజేపీ అధిష్టానం వేటు..?
గడప గడపకు కార్యక్రమంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల వెంట్రుకలు ప్రజలు పీకుతున్నారని.. ఇక, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెంట్రుకలు పీకే సమయం కూడా దగ్గరపడిందని హెచ్చరించారు జనసేన నేత పంతం నానాజీ.. మరోవైపు, మల్లాడి సత్యలింగం నాయకర్ గురించి మాట్లాడే అర్హత ముఖ్యమంత్రి జగన్‌కి లేదని.. నాయకర్ దానం చేసిన భూములు వైసీపీ నాయకులు కబ్జా చేసి శిస్తులు కూడా కట్టడంలేదని ఆరోపించారు జనసేన నేత పితాని బాలకృష్ణ. కాగా, ప్రభుత్వ పథకాల ద్వారా రూ.లక్షా 40 వేల కోట్లు పేదలకు అందించాం.. ప్రజలకు మంచి చేశామని చెప్పే ధైర్యం చంద్రబాబుకు లేదు.. చంద్రబాబు మంచి చేశాడు అని చెప్పే ధైర్యం ఆ దత్తపుత్రుడికి కూడా లేదు అంటూ సీఎం జగన్ సెటైర్లు వేసిన విషయం తెలిసిందే..