Site icon NTV Telugu

Pawan Kalyan: పాపం పసివాడు, నోట్లో వేలు పెడితే కొరకలేడు.. జగన్ పై పవన్ సెటైర్

Pawan

Pawan

Pawan Kalyan: ఏపీ రాజకీయాలు రోజురోజుకు హీటెక్కిస్తున్నాయి. ఎలక్షన్స్ సమయం కావడంతో ఒకరిపై ఒకరు మాటల తూటాలను పేల్చుకుంటున్నారు. ఒకరు కౌంటర్ వేస్తె .. ఇంకొకరు సైటర్లు వేస్తున్నారు. ముఖ్యంగా జనసేన, టీడీపీ, వైఎసార్సీపీ నాయకుల మధ్య మాటల యుద్ధాలే నడుస్తున్నాయి. ఇక మంగళవారం నిజాంపట్నంలో జనసేనానిపై సీఎం ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. దీనికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సెటైర్లు పేల్చారు. ట్విట్టర్ వేదికగా జగన్ కార్టూన్స్ ను షేర్ చేస్తూ పాపం పసివాడు అంటూ ఆట పట్టించడం మొదలుపెట్టారు. జగన్ చెప్పే మాటలను పాపం పసివాడు సినిమాగా తీయొచ్చని ఆ సినిమా పోస్టర్ ను షేర్ చేస్తూ పవన్ ట్వీట్ చేశారు.” మన ఏపీ సీఎంతో ఎవరైనా పాపం పసివాడు సినిమా తీస్తారని నేను ఆశిస్తున్నాను. ఆయన చాలా అమాయకుడు.. అయితే ఇక్కడ ఓ చిన్న మార్పు అవసరం ఉంది.. ఆయన చేతిలో ఒక్క సూట్‌కేస్ బదులుగా.. అక్రమ సంపాదన కోసం మనీ లాండరింగ్‌ని ఈజీగా చేసే సూట్‌కేస్ కంపెనీలు ఉంచాలి” అని చెప్పుకొచ్చారు.

ఇక అంతే కాకుండా.. పాపం పసివాడు సినిమా స్టోరీకి రాజస్థాన్ ఎడారిలో ఇసుక దిబ్బలు కావాలని.. కానీ ఏపీలో మాత్రం వైఎస్సార్‌సీపీ నదుల నుంచి ఇసుకను దోచేస్తోందని అన్నారు. ఇక్కడ కలెక్షన్ పాయింట్లలో తగినంత ఇసుక దిబ్బలు ఉన్నాయని చెప్తూ.. చీర్స్ కొట్టారు. ఇక కొద్దిసేపటి క్రితం జగన్ కార్టూన్ పోస్టర్ షేర్ చేస్తూ పాపం పసివాడు, నోట్లో వేలు పెడితే కొరకలేడు అని క్యాప్షన్ కూడా రాసుకొచ్చారు. ప్రస్తుతం పవన్ ట్వీట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. జగన్ ను ఈ విధంగా ర్యాగింగ్ చేస్తున్నారేంటి అని కొందరు అంటుండగా.. పవన్.. ప్యాకేజ్ స్టార్ .. ఇలానే మాట్లాడతాడు అని ఇంకొందరు చెప్పుకొస్తున్నారు.

Exit mobile version