Site icon NTV Telugu

మార్పు కోసం పోరాటం.. జనసేన అభ్యర్థులను ఆశీర్వదించండి-పవన్

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థలకు జరుగుతోన్న ఉప ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థులను గెలిపించాలంటూ విజ్ఞప్తి చేశారు జనసేనాని పవన్‌ కల్యాణ్.. స్థానిక ఎన్నికల్లో జనసేన అభ్యర్థులను ఆశీర్వదించండి.. ఒక మార్పు కోసం ఈ పోరాటం జరుగుతోంది.. జన సైనికులు పదవుల కోసం కాకుండా సేవచేయడానికే ముందుంటారు.. ప్రజల కోసం పని చేసే వారికే అభ్యర్థులుగా నిలబెట్టాం అని… ప్రజా సమస్యల పరిష్కారం కోసం పాటుపడేవారినే ఈ ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేస్తున్నారు.. పార్టీ భావజాలాన్ని అర్థం చేసుకున్న అభ్యర్థులు పోటీలో నిలిచారని తెలిపారు.. స్థానిక సమస్యలపై అవగాహనతో, సామాజిక స్పృహతో పని చేసేవారిని స్థానిక సంస్థల ప్రతినిధులుగా ఎన్నుకొంటే ప్రజా గళం ప్రతిధ్వనిస్తుందని పేర్కొన్న పవన్.. జనసేనతో మైత్రి ఉన్న బీజేపీ కొన్ని స్థానాల్లో పోటీ చేస్తోందని.. మన బిడ్డలకు పాతికేళ్ల భవిష్యత్తు కోసం పరితపించే జనసేన అభ్యర్థులకు ఓటేసి ఆశీర్వదించి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.. మిత్ర పక్షం బీజేపీ తరఫున బరిలో ఉన్న అభ్యర్థులను గెలిపించాలని కోరారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.

Exit mobile version