Site icon NTV Telugu

Pantham Nanaji: చెత్తపై పన్ను వేసే చెత్తనా కొడుకుల బ్యాచ్ మీది.. పవన్‌పై విమర్శలా..?

Pantham Nanaji

Pantham Nanaji

ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీ, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం సాగుతూనే ఉంది.. టీడీపీతో పాటు.. పవన్‌ కల్యాణ్‌ను టార్గెట్ చేస్తోంది వైసీపీ.. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై తాజాగా మంత్రి దాడిశెట్టి రాజా చేసిన కామెంట్స్ హాట్‌ టాపిక్‌గా మారాయి.. అయితే, పవన్‌పై దాడిశెట్టి చేసిన వ్యాఖ్యాలపై జనసేన పీఏపీ సభ్యుడు పంతం నానాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు.. చెత్తపై పన్నులు వేసే చెత్తనా కొడుకుల బ్యాచ్ మీది అంటూ ఘాటుగా విమర్శలు గుప్పించారు.. వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు నానాజీ.. కాకినాడలో ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. పవన్ కల్యాణ్‌ ప్రజలకు మంచి పని చేయడానికి వచ్చిన ప్రతిసారీ ఆయనపై విమర్శలు చేయడానికి ఇలాంటి చెత్త బ్యాచ్ ఒకటి తయారవుతుంది. ఈ సారి తుని ఎమ్మెల్యే, మంత్రి దాడి శెట్టి రాజా వంతు వచ్చింది. తునిలో మీరు చేసే దొంగ బంగారం, గంజాయి వ్యాపారం మాటేమిటి అంటూ ప్రశ్నించారు నానాజీ.

Read Also: Raja Singh granted bail: రాజాసింగ్‌కు బెయిల్‌ మంజూరు చేసిన కోర్టు..

ఇక, తునిలో నవరత్నాలను దొంగ బంగారం, మద్యం, గంజాయి, భూ కబ్జా, నకిలీ విత్తనాలు, ఇసుక మాఫియాగా మార్చేసిన ఘనత మీది అంటూ దాడిశెట్టి రాజాపై విమర్శలు గుప్పించారు నానాజీ.. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో 176 మంది కౌలు రైతులు చనిపోతే వారిని గుర్తించడం మానేసి.. కౌలు రైతుల కుటుంబాలకు ఆర్ధిక సహాయం చేస్తున్న పవన్ కల్యాణ్‌పై సిగ్గు లేకుండా విమర్శలు చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. త్వరలో మీ పార్టీకి చెందిన 150 మంది ఎమ్మెల్యేలకు గుండు కొట్టించడానికి మా దగ్గర బార్బర్ లు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు.. ఇక, భారతీయ జనతా పార్టీతో మేం సంసారం చేస్తున్న మాట వాస్తవమే.. కానీ, మీ నాయకుడు ఢిల్లీ వెళ్లి బీజేపీతో వ్యభిచారం చేస్తున్నాడు అంటూ మండిపడ్డారు.. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కన్నబాబు సూట్ కేస్ లు జాగ్రత్తగా దాచుకోవాలి.. లేదంటే గతంలో మీరు వైజాగ్ నుండి తెస్తున్న సూట్ కేస్ లు పెట్టుకుపోయినట్టే ఇప్పుడు మళ్లీ ఏదో ఒక టీమ్ వచ్చి సూట్ కేస్ లు పట్టుకుపోతారు అంటూ ఎద్దేవా చేశారు.. కాకినాడ రూరల్‌లోని ఇండస్ట్రీలు అన్నింటికి పదిరోజులు గడువు ఇస్తున్నాం… పదిరోజుల్లో మీ పరిశ్రమలలో కార్మికుల భద్రత కు అవసరమైన చర్యలు తీసుకోవాలి.. లేదంటే జనసేన దీనిపై పోరాటం చేస్తుందని నానాజీ హెచ్చరించారు.

Exit mobile version