NTV Telugu Site icon

Naga Babu: విమర్శలు చేయడం తప్ప.. ఏపీ మంత్రులకు ఏ పని లేదు

Nagababu Fires On Ap Minist

Nagababu Fires On Ap Minist

Janasena Leader Naga Babu Fires On AP Ministers: జనసేన నేత కొణిదెల నాగబాబు మరోసారి ఏపీ మంత్రులపై నిప్పులు చెరిగారు. విమర్శలు చేయడం తప్ప ఏపీ మంత్రలకు ఏ పని లేదని.. మంత్రులకు తాము చేయాల్సిన పని వారు చేయడం లేదని విమర్శించారు. శ్రీకాకుళంలో రణస్థలం, యువశక్తి కార్యక్రమం సభా స్థలంలో నాగబాబు మాట్లాడుతూ.. యువకులతో సభ అనేది చాలా అవసరమన్నారు. అలోచన, ఆవేదన చెప్పడానికి ఈ సభ మంచి అవకాశమని పేర్కొన్నారు. యువత చాలా పవర్‌ఫుల్ అని, ఈ సభను యువత ఒక అవకాశంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. యువత భవిష్యత్ కోసం జనసేన పార్టీ కంకణం కట్టుకుందన్నారు. సభకు తాము పెట్టిన రణస్థలం పేరు.. యూత్ పవర్‌కి తగ్గట్టుగా ఉందన్నారు. ఏపీలో ఈరోజు ఉద్యోగాలు గానీ, ఉద్యోగ అవకాశాలు గానీ లేవని మండిపడ్డారు. యువతకు తమ జనసేన పార్టీ వెన్నుదన్నుగా ఉంటుందని భరోసానిచ్చారు.

Longest River Cruise: గంగానదిలో ప్రపంచంలోనే అతిపొడవైన రివర్ క్రూయిజ్.. ప్రారంభించనున్న ప్రధాని

అంతకుముందు జీవో నం.1 తీసుకురావడంపై కూడా నాగబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ జీవోని వెనక్కి తీసుకుంటే మంచిదని, లేకపోతే ప్రజలే తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. చంద్రబాబు, పవన్‌ను ఎంత ఆపితే.. అంతే లెగుస్తారన్నారు. రాజకీయ పార్టీగా తమ జాగ్రత్తలు తాము తీసుకుంటామని, ప్రజలకు రక్షణ కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. అలాగే.. మంత్రి రోజాపై కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. పర్యాటక శాఖ మంత్రి రోజాది నోరు కాదని, అదో మున్సిపాలిటీ చెత్త కుప్ప అని వ్యాఖ్యానించారు. ఓవైపు ఏపీ పర్యాటక వాఖ నేషనల్ ర్యాంకింగ్స్‌లో పడిపోతుంటే, మరోవైపు రోజా బాధ్యత మరిచి నోటికొచ్చినట్లు మాట్లాడుతోందని ఫైర్ అయ్యారు. పదవి నుంచి రోజా దిగిపోయేలోపే ఆ ర్యాంకింగ్ 20కి పడిపోయిన ఆశ్చర్యపోనక్కర్లేదని ఎద్దేవా చేశారు. అయితే.. ఇందుకు రోజా కూడా గట్టి కౌంటరే ఇచ్చారు. పర్యాటక రంగంలో ఏపీ మూడో స్థానంలో ఉందంటూ.. సాక్ష్యాలతో స్పందించారు.

Nadendla Manohar: వనరులు దోచుకొని.. నాయకత్వాన్ని ఎదనీయడం లేదు