కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది… జనసేనపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా.. బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ దగ్గర గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేనిని అడ్డుకునేందుకు యత్నించాయి జనసేన పార్టీ శ్రేణులు.. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొనగా.. రంగంలోకి దిగిన పోలీసులు.. జనసేన నేతలు, కార్యకర్తలను అరెస్ట్ చేవారు.. ఈ నేపథ్యంలో.. జనసేన శ్రేణులు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది..
Read Also: Congress: మహిళా ఎంపీ బట్టలు చింపేయడం దారుణం.. శశిథరూర్ ట్వీట్
కాగా, గన్నవరం వైసీపీలో అంతర్గత కుమ్ములాటలు ఓవైపు జరుగుతుండగా.. మరోవైపు జనసేన, టీడీపీ నేతలను టార్గెట్ చేస్తూ విమర్శలు గుపిస్తున్నారు వల్లభనేని వంశీ.. గత కొంత కాలంగా జనసేన, వైసీపీ నేతల మధ్య జరుగుతోన్న మాటల యుద్ధం.. ఇప్పుడు ఎమ్మెల్యేను అడ్డుకునే వరకు వెళ్లింది.. తాజాగా, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది జనసేన.. స్ధానిక సంస్ధల ఎన్నికల్లో వైసీపీలోని కొందరు.. జనసేన కార్యకర్తలకు డబ్బులు ఇచ్చి.. వైసీపీ అభ్యర్థులను ఓడించేందుకు పనిచేశారంటూ వంశీ చేసిన వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. జనసేన నేతలు డబ్బులు తీసుకున్నట్లు రుజువు చేయాలని ఎమ్మెల్యే వల్లభనేని వంశీని డిమాండ్ చేశారు జనసేన నేతలు.
