అవకాశం దొరికినప్పుడల్లా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్… ఇప్పటికే గంజాయి విషయంలో ఏపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలపై ఆరోపణలు చేశారు.. ఇక, ఈ మధ్యే విశాఖలో పర్యటించిన జనసేనాని.. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం కార్మిక సంఘాలు చేస్తున్న ఆందోళనకు సంఘీభావం తెలిపారు.. అయితే, ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనకు సిద్ధమయ్యారు పవన్ కల్యాణ్.. ఈ నెల 21న నరసాపురంలో పర్యటించనున్నారు.. 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు స్వర్ణాంధ్ర ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్స్ లో నిర్వహించనున్న బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు. ఇక, పార్టీ అధినేత పర్యటనను దృష్టిలో ఉంచుకుని.. బహిరంగసభ విజయవంతం చేసేందుకు సిద్ధం అవుతున్నాయి జనసేన పార్టీ శ్రేణులు.
నరసాపురం పర్యటనకు సిద్ధమైన జనసేనాని
