మత్స్యకారుల సమస్యలపై ఫోకస్ పెట్టింది జనసేన పార్టీ.. క్షేత్రస్థాయిలో మత్స్యకారుల సమస్యల అధ్యయనంపై కాకినాడ రూరల్ సూర్యారావుపేటలో జరిగే గ్రామ సందర్శన కార్యక్రమానికి ఇవాళ జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ శ్రీకారం చుట్టనున్నారు.. మత్స్యకారుల జీవనోపాధికి విఘాతం కల్పించేలా ఉన్న 217 జీవో, ఎంఎఫ్‌ఆర్‌ఏ, సీఆర్‌జడ్ సక్రమ అమలు, ఆయిల్ రాయితీ, సీజనల్ బేన్, మడ అడవుల నరికివేత వంటి వాటిపై క్షేత్రస్థాయిలో ఇబ్బందులు తెలుసుకోవడానికి పాదయాత్ర నిర్వహించనున్నారు.. జీవో 217 రద్దు డిమాండ్‌తో ఉభయగోదావరి జిల్లాల్లో పాదయాత్ర నిర్వహించనుంది జనసేన.. ఇక, ఈనెల 20న నరసాపురంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు.. ఈ బహిరంగ సభకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ హాజరుకానుండగా.. తమ సమస్యలను జనసేనానికి నివేదించనున్నారు మత్స్యకారులు..
Read Also: PSLV C-52: మొదలైన కౌంట్‌డౌన్.. ఈ ఏడాది తొలి ప్రయోగం..