అంబేద్కర్ చూపిన మార్గంలోనే జనసేన పార్టీ ప్రస్థానం కొనసాగుతోందని పేర్కొన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్… రాజ్యాంగ నిర్మాత, భారతరత్నం బాబా సాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా.. ఓ ప్రకటన విడుదల చేసిన జనసేనాని.. అంబేద్కర్ ఆలోచనలు, సిద్ధాంతాలు సర్వదా అనుసరణీయం అన్నారు.. రాజ్యాంగంలో అంబేద్కర్ కల్పించిన పౌరహక్కులు, ఆదేశిక సూత్రాలు నేటికీ, ఏనాటికీ ప్రజలకు రక్షణగానే నిలుస్తుంటాయని పేర్కొన్న ఆయన.. నేటి తరం రాజకీయ నాయకుల వికృత వైపరీత్యాలను అంబేద్కర్ ముందే పసిగట్టి ప్రజలకు రక్షా బంధనం రూపొందించారని గుర్తుచేశారు… ఇక, అంబేద్కర్ చూపిన మార్గంలో జనసేన ప్రస్థానం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
Read Also: పార్లమెంట్ ఉభయసభల నుంచి టీఆర్ఎస్ వాకౌట్..
నేను ఆరాధించే గొప్ప సంఘ సంస్కర్త అంబేద్కర్ అని పేర్కొన్నారు పవన్ కల్యాణ్.. ఆయన ఆలోచనలు, సిద్ధాంతాలు సర్వదా అనుసరణీయం, ఆయనపట్ల నాకున్న భక్తి బావనే లండన్‌లో ఆయన నివసించిన గృహాన్ని, లక్నోలో ఆయన స్మారక మందిరాన్ని సందర్శించేలా చేసిందని.. దేశంలో నిరంతరాయంగా ప్రజాస్వామ్యం పరిడవిల్లడానికి రాజ్యాంగ రూపకర్తగా అంబేద్కర్ ఆద్యులుగా చెప్పుకోవడం మనకు గర్వ కారణం అన్నారు పవన్ కల్యాణ్.