NTV Telugu Site icon

Janasena : పిఠాపురం జనసేన సభకు మూడు దారులు.. ఏ దారిలో ఎవరు వెళ్లాలంటే..?

Janasena

Janasena

Janasena : పిఠాపురంలో ఈ రోజు జరుగుతున్న జనసేన 12వ ఆవిర్భావ సభ పైనే అదరి దృష్టి ఉంది. పిఠాపురంలో జరుగుతున్న సభకు వెళ్లడానికి అన్ని దారుల్లో జనసైనికులు బయలు దేరుతున్నారు. అయితే సభ దగ్గర మాత్రం మూడు దారులు పెట్టారు. ఈ మూడు దారుల నుంచే సభకు చేరుకోవాలి. ఒక్కో దారిలో ఒక్కొక్కరికి పర్మిషన్ ఇచ్చారు. ఇందులో చూసుకుంటే రాజావారి ద్వారం నుంచి పిఠాపురం ఎమ్మెల్యేగారి తాలూకా, వీర మహిళలకు మాత్రమే వెళ్లాలి. వీరు ఇక్కడ పాస్ లు చూపిస్తే వారికి ఎంట్రీ ఉంటుంది.

Read Also : CM Chandrababu: ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలకు చంద్రబాబు కీలక ఆదేశాలు.. పర్యటించాల్సిందే..!

ఇక రెండోది డొక్కా సీతమ్మ ద్వారం. ఇక్కడి నుంచి వీఐపీ, వీవీఐపీలకు ఎంట్రీ ఉంది. వీరు ఇక్కడి నుంచి సభకు చేరుకుంటారు. ఇక మూడోది మల్లాడి సత్యలింగం ద్వారం. ఇక్కడి నుంచి జనసేన కార్యకర్తలు మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. జనసేన పార్టీ ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న మొదటి సభ కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. పవన్ కల్యాణ్ ఏం మాట్లాడుతారా అని అంతా ఎదురు చూస్తున్నారు.