Andhra Pradesh: విద్యార్థులకు అలర్ట్.. జగనన్న విద్యాదీవెన వాయిదా

ఏపీలో విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బుల చెల్లింపుల కోసం ప్రవేశపెట్టిన ‘జగనన్న విద్యాదీవెన’ పథకం వాయిదా పడింది. గతంలో ప్రకటించిన దాని ప్రకారం ఇవాళ విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఫీజుల డబ్బులు జమ చేయాల్సి ఉంది. కానీ ప్రస్తుతం ఈ ప‌థ‌కం వాయిదా ప‌డ‌టంతో ఈ రోజు విద్యార్థుల త‌ల్లుల ఖాతాల్లో డ‌బ్బులు ప‌డే అవకాశాలు లేవు.

అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్సవం సంద‌ర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించే ప్రభుత్వ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొనాల్సి ఉంది. ఈ కారణంగా జ‌గ‌న‌న్న విద్యా దీవెన ప‌థ‌కం తాత్కాలికంగా వాయిదా ప‌డింది. కాగా జగనన్న విద్యా దీవెన ప‌థ‌కం అమ‌లు కొత్త తేదీని రాష్ట్ర ప్రభుత్వం త్వర‌లోనే ప్రకటిస్తుంద‌ని అధికారులు తెలిపారు.

https://ntvtelugu.com/ap-cm-jagan-sensational-comments-about-tdp-preotest-in-assembly/