మార్చిలో విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జగనన్న విద్యా దీవెన డబ్బులను ఏపీ ప్రభుత్వం జమ చేయనుంది. అయితే జగనన్న విద్యాదీవెన వెరిఫికేషన్ పూర్తికాలేదని ఫోన్‌కు సందేశాలు వచ్చిన విద్యార్థులు వెంటనే గ్రామ లేదా వార్డు సచివాలయాలకు వెళ్లి.. ఫైవ్ స్టెప్ వెరిఫికేషన్‌కు సంబంధించిన డాక్యుమెంట్స్‌ను సమర్పించాలి. వెరిఫికేషన్ పూర్తై ఇన్‌ఎలిజిబుల్ అయితే.. సచివాలయంలోని వెల్ఫేర్ అసిస్టెంట్లను కలవాలి. అర్హత ఉన్న విద్యార్థులు అబ్జెక్షన్ రైజ్ చేయడానికి ఈ నెల 21 వరకు గడువు ఉంది.
మార్చిలో జగనన్న విద్యాదీవెన డబ్బులు పడకపోతే చెక్ చేసుకునే విధానాన్ని కూడా ఏపీ ప్రభుత్వం గతంలో ప్రకటించింది. విద్యార్థులు జ్ఞానభూమి అనే వెబ్‌సైట్ ఓపెన్ చేసి స్టూడెంట్ ఆధార్, పాస్‌వర్డ్ సాయంతో లాగిన్ అవ్వాలి. అందులో వ్యూ/ప్రింట్ స్కాలర్‌షిప్ అప్లికేషన్ స్టేటస్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి. అందులో ఏ విద్యాసంవత్సరానికి సంబంధించిన స్టేటస్ తెలుసుకోవాలనుకుంటున్నారో అనేది ఎంచుకోవాలి. అందులో మీ స్టేటస్ ఎలిజిబుల్ అని ఓటీఏ కంప్లీటెడ్ అని చూపిస్తే మీకు ఇంకా డబ్బులు రాలేదని అర్ధం. ఒకవేళ రిలీజ్డ్ అని చూపిస్తే మీకు నగదు వచ్చినట్లు అర్ధం. టీబీఆర్ నెంబర్ జనరేట్ అయిన వారం రోజుల తర్వాత మీ అకౌంట్లో డబ్బులు క్రెడిట్ అయ్యే అవకాశముంది.
