NTV Telugu Site icon

ISRO Activities: ఇస్రోలో ఇక రయ్ రయ్ మంటూ ప్రయోగాలు

కరోనా అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపించింది. ముఖ్యంగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోలో కార్యకలాపాలు నిలిచిపోయాయి.సైంటిస్టులు, ఇతర ఉద్యోగులు కూడా కరోనా బారిన పడ్డారు. దీంతో ప్రయోగాలకు బ్రేక్ పడింది. ఈ ఏడాది 19 ప్రయోగాలు చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో 8 రాకెట్లు, 7 అంతరిక్ష నౌకలు , 4 టెక్నాలజీ డెమానేషన్ ప్రయోగాలు ఉన్నాయి. వీటిల్లో చంద్రయాన్ -3 కూడా ఉంది. ఈ ఏడాది తొలి రాకెట్ ప్రయోగం ( పీఎస్ఎల్వీ – సి 52 ) ఫిబ్రవరి 14 న సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి చేపట్టనుంది.

ఇది భూ పరిశీలన ఉపగ్రహం. ఆర్ఎస్ఐశాట్ -1 ఎ తోపాటు ఐఎన్ఎస్ -2 డి ఉపగ్రహాలను కక్ష్యలోకి మోసుకెళ్లనుంది. చంద్రయాన్ -3 ప్రయోగంపై యావత్ భారతం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ ప్రయోగాన్ని ఆగస్టులో చేపట్టనుంది. ఈ ప్రయోగాన్ని గతేడాదే చేపట్టాలని నిర్ణయించినా కొవిడ్ వల్ల వాయిదా వేశారు. 2020, 2021 లో కరోనా మహమ్మారి వల్ల ఇస్రో రాకెట్ ప్రయోగాలు సక్రమంగా చేపట్టలేకపోయింది. ఈ ఏడాది థర్డ్ వేవ్ ముగియడంతో ప్రయోగాల్లో స్పీడ్ పెంచనుంది,