NTV Telugu Site icon

IPS Transfers: ఏపీలో పలువురు ఐపీఎస్ అధికారుల బదిలీ

Dgp1

Dgp1

ఏపీలో పలువురు ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏసీబీ డీఐజీగా పీహెచ్ డీ రామకృష్ణను బదిలీ చేయగా.. టెక్నికల్ సర్వీసెస్ డీఐజీగా అదనపు బాధ్యతలు అప్పగించారు.

ఏసీబీ డీఐజీగా పీహెచ్ డీ రామకృష్ణ… టెక్నికల్ సర్వీసెస్ డీఐజీగా అదనపు బాధ్యతలు. క్రీడలు, సంక్షేమం ఐజీగా ఎల్ కేవీ రంగారావు… రైల్వే ఏడీజీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆక్టోపస్ డీఐజీగా ఎస్వీ రాజశేఖర్… లా అండ్ ఆర్డర్ డీఐజీగా అదనపు బాధ్యతలు. పోలీసు ట్రైనింగ్ వ్యవహారాల డీఐజీగా కేవీ మోహన్ రావుని నియమించారు.

తీర ప్రాంత సెక్యూరిటీ డీఐజీగా ఎస్.హరికృష్ణకు అదనపు బాధ్యతలు అప్పగించారు. గ్రేహౌండ్స్ డీఐజీగా గోపీనాథ్ జెట్టి… జ్యుడిషియల్ వ్యవహారాల ఐజీగా అదనపు బాధ్యతలు ఇచ్చారు. 16వ బెటాలియన్ కమాండెంట్ గా కోయ ప్రవీణ్ బదిలీ. విజయవాడ రైల్వే ఎస్పీగా విశాల్ గున్నీకి అదనపు బాధ్యతలు
కాకినాడ ఏపీఎస్పీ 3వ బెటాలియన్ కమాండెంట్ గా రవీంద్రనాథ్ బాబుకు అదనపు బాధ్యతలు. గుంతకల్ రైల్వే ఎస్పీగా అజిత వేజెండ్లకు అదనపు బాధ్యతలు అప్పగించారు. డి.ఉదయభాస్కర్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో రిపోర్టు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. అలాగే పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు పి.అనిల్ బాబుని బదిలీ చేశారు. మరో అధికారి డీఎన్ మహేశ్ ని పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు బదిలీ చేశారు.

రంపచోడవరం అదనపు ఎస్పీ (ఆపరేషన్స్)గా జి.కృష్ణకాంత్.
చిత్తూరు అదనపు ఎస్పీ (అడ్మినిస్ట్రేషన్)గా పి.జగదీశ్.
పాడేరు అదనపు ఎస్పీ (అడ్మినిస్ట్రేషన్)గా తుహిన్ సిన్హా.
పల్నాడు అదనపు ఎస్పీ (అడ్మినిస్ట్రేషన్)గా బిందుమాధవ్ గరికపాటి.
విజిలెన్స్, ఎన్ ఫోర్స్ మెంట్ ఎస్పీగా పి.రవికుమార్.

Kamal Haasan: హిందీ వివాదంపై కమల్ సంచలన వ్యాఖ్యలు.. అల్టిమేటమ్ జారీ