NTV Telugu Site icon

Vakula matha Temple: వకుళామాత ఆలయ ప్రారంభానికి జగన్‌కి ఆహ్వానం

Jagan 1

Jagan 1

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలిసి శ్రీ వకుళమాత ఆలయం, (పాతకాల్వ (పేరూరు), తిరుపతి) ప్రారంభోత్సవానికి ఆహ్వనించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టీటీడీ ఈవో ఏ.వి. ధర్మారెడ్డి. ఈ నెల 23న విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ, మహా సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

ఈ నెల 18 న అంకురార్పణతో మొదలై 23 వరకు వివిధ రకాల పూజా కార్యక్రమాలు, 23 న మహా సంప్రోక్షణ ఆవాహన, ప్రాణ ప్రతిష్ఠ జరుగుతాయి. ఆహ్వానపత్రాన్ని ముఖ్యమంత్రికి అందజేశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టీటీడీ ఈవో ఏ.వి.ధర్మారెడ్డి. అనంతరం స్వామివారి ప్రసాదాలు, వస్త్రం అందజేసి వేద ఆశీర్వచనం ఇచ్చారు టీటీడీ వేద పండితులు.

ఇదిలా వుండగా.. టీటీడీ నూతనంగా నిర్మించిన శ్రీవకుళమాత ఆల‌యంలో మ‌హాసంప్రోక్షణ కార్యక్రమాల్లో ఆదివారం శాస్త్రోక్తంగా పంచగవ్యాధివాసం నిర్వహించారు.గతంలో ఈ వకుళామాత ఆలయంలో గంట కొట్టాకే తిరుమల శ్రీవారికి నైవేద్యం పెట్టేవారని చెబుతారు. శిథిలావస్థలో వున్న ఆలయానికి పూర్వ వైభవం తెస్తోంది టీటీడీ.

కార్యక్రమాల్లో భాగంగా జూన్ 21న ఉద‌యం 8.30 గంట‌లకు పుణ్యాహ‌వ‌చ‌నం, కుంభారాధ‌న‌, చ‌తుర్ధశ క‌ల‌శ స్నప‌న జ‌లాధివాసం, సాయంత్రం 6.30 గంట‌ల నుండి హోమం, యాగ‌శాల కార్యక్రమాలు నిర్వహిస్తారు. జూన్ 22న ఉద‌యం 8 గంట‌ల‌కు విమాన క‌ల‌శ స్థాప‌న‌, గోపుర క‌ల‌శ స్థాప‌న‌, ర‌త్నన్యాసం, ధాతున్యాసం, విగ్రహ స్థాప‌న, మ‌ధ్యాహ్నం 2 నుండి 4 గంట‌ల వ‌ర‌కు ఆల‌యంలో స్నప‌న తిరుమంజ‌నం నిర్వహిస్తారు. సాయంత్రం 5.30 నుండి 6.30 గంట‌ల వ‌ర‌కు మ‌హాశాంతి తిరుమంజ‌నం, రాత్రి 8 గంట‌లకు కుంభారాధ‌నం, నివేద‌న‌, శ‌య‌నాధివాసం, విశేష హోమాలు, యాగ‌శాల కార్యక్రమాలు నిర్వహిస్తారు.

జూన్ 23న ఉద‌యం 4.30 నుండి 7 గంట‌ల వ‌ర‌కు కుంభారాధ‌న‌, నివేద‌న‌, హోమం, మ‌హాపూర్ణాహుతి, విమాన గోపుర క‌ల‌శ ఆవాహ‌న, ఉద‌యం 7.30 నుండి 8.30 గంట‌ల వ‌ర‌కు మిథున ల‌గ్నంలో ప్రాణ ప్రతిష్ట మ‌హాసంప్రోక్షణ నిర్వహిస్తారు. ఉదయం 10 గంట‌ల‌కు ధ్వజారోహ‌ణం, ఉద‌యం 10.30 నుండి భ‌క్తుల‌కు అమ్మవారి ద‌ర్శనం క‌ల్పిస్తారు. సాయంత్రం 3.30 నుండి 4.30 గంట‌ల వ‌ర‌కు శాంతి క‌ల్యాణోత్సవం జ‌రుగ‌నుంది. అనంత‌రం ధ్వజావ‌రోహ‌ణం చేప‌డ‌తారు. సాయంత్రం 6.30 నుండి రాత్రి 9 గంట‌ల వ‌ర‌కు స‌ర్వద‌ర్శనం క‌ల్పిస్తారు.

Bandi Sanjay: సీఎంకు బండి లేఖ‌.. ‘‘నిరో చక్రవర్తి’’ గా వ్యవహరిస్తున్నారని ఫైర్‌