NTV Telugu Site icon

Internet Open: అక్కడ ఇంటర్నెట్ కష్టాలకు చెక్

Internet

Internet

కోనసీమ జిల్లాలో పూర్తిగా ఇంటర్నెట్ సేవలు పునరుద్దరణ జరిగాయి.దాదాపు 14 రోజుల తర్వాత పూర్తిగా బయట ప్రపంచం వారితో సంబంధాలు మొదలయ్యాయి. కోనసీమలో జరిగిన అల్లర్లతో జిల్లాలో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. దాంతో రెండు వారాలుగా జిల్లావాసులు పడ్డ కష్టాలు తొలగిపోనున్నాయి.

గత నెల 24న అమలాపురంలో విధ్వంసకాండ జరిగింది. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టొద్దని నిరసనకారులు భారీ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు.. దాంతో అప్పటి నుంచి జిల్లావ్యాప్తంగా 16 మండలాలలో ఇంటర్నెట్ సేవలను నిలిపి వేసారు పోలీసులు… సోషల్ మీడియా ద్వారా జరిగే ప్రచారానికి అడ్డుకట్ట వేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు.. అమలాపురం, కొత్తపేట, పి.గన్నవరం, రాజోలు, ముమ్మిడివరం నియోజకవర్గాల్లో పూర్తిగా నెట్ బంద్ అయింది. రామచంద్రపురం మండపేట నియోజకవర్గాల్లో కొన్ని గ్రామాల్లో ఇంటర్నెట్ సేవలకు ఆటంకం కలిగింది. దాంతో గత రెండు వారాలుగా జిల్లాలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

ప్రభుత్వ ప్రైవేటు బ్యాంకింగ్ సేవలు నిలిచిపోయాయి. పాస్ పోర్ట్ కేంద్రం పని చేయలేదు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అమలాపురంలో మాత్రమే పాస్ పోర్ట్ కేంద్రం ఉంది. దాంతో స్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళు రీషెడ్యూల్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆన్లైన్ పేమెంట్ లు కాక వ్యాపారాలు తగ్గిపోయాయి.ప్రతిదానికి నెట్ కావాల్సి రావడంతో వినియోగదారులు ఇబ్బందులు పడ్డారు. పోలీసులు అతి జాగ్రత్తతో తమకు నష్టం తెస్తున్నారని జిల్లా వాసులు మండిపడ్డారు.

అయితే గత నాలుగు రోజులుగా మండలాల వారీగా ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరించారు పోలీసులు. ముందుగా జిల్లా కేంద్రానికి దూరంగా ఉన్న మండలాల్లో ఇంటర్నెట్ ఇచ్చారు. తర్వాత విడతలవారీగా జిల్లా మొత్తం కవర్ చేశారు. ఇప్పటికి మరో నాలుగు మండలాలు పెండింగ్ ఉండగా వాడికి కూడా ఇంటర్నెట్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దాంతో రెండు వారాల సుదీర్ఘ విరామం తర్వాత నెట్ వచ్చింది.. విదేశాలలో తమ బంధువులు ఉన్న వారు రోజు వీడియో కాల్ మాట్లాడుకోవడం ఇప్పుడు అలవాటుగా మారింది. కాని గత కొద్ది రోజులుగా ఆ సదుపాయానికి బ్రేక్ పడింది.. సాష్ట్ వేర్ ఉద్యోగులు సైతం ల్యాప్ టాప్ పట్టుకుని నెట్ కోసం తిరిగేవారు. గోదావరి గట్టు దగ్గర కూర్చుని తమ పనులు చక్క బెట్టుకునేవారు. ఇప్పుడు పోలీసులు తీసుకున్న నిర్ణయంతో రిలీఫ్ అయ్యారు.. యధావిధిగా తమ పనులు తాము చేసుకోవచ్చని ఆనందపడుతున్నారు.. కొద్ది రోజులు పాత కాలానికి వెళ్ళిపోయామని అంటున్నారు…తిరిగి ఆధునిక ప్రపంచంలోకి ఎంటర్ అయ్యారు.

మొత్తానికి ఆందోళనలు సర్దుకోవడంతో పోలీసులు నెట్ సేవలు పునరుద్ధరించారు. దాంతో జిల్లావాసులకు ఎక్కడలేని సంతోషం వచ్చింది.. తిరిగి యధావిధిగా పరుగుల ప్రపంచంలోకి వెళ్ళిపోయారు. సుదీర్ఘ విరామం తర్వాత నెట్ సేవలతో సంబరపడిపోతున్నారు వ్యాపారులు.

FISH Lorry: చేపల లారీ బోల్తా.. క్షణాల్లో చేపలు మాయం