Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Interesting Conversation Between Minister Perni Nani And Rgv Meeting

ఆర్జీవీ, పేర్ని నాని భేటీ… అసలు కథ ఇదీ !

Published Date :January 11, 2022 , 2:39 pm
By Sudhakar Ravula
ఆర్జీవీ, పేర్ని నాని భేటీ… అసలు కథ ఇదీ !
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల వ్యవహారం ఓ దశలో ప్రభుత్వం వర్సెస్‌ టాలీవుడ్‌గా మారింది.. అయితే, ఈ వ్యవహారం మరింత రచ్చగా మారకుండా సినీ పెద్దలు కొందరు రంగంలోకి దిగి ప్రభుత్వంలో చర్చలు జరపడం.. ప్రభుత్వం కమిటీ వేయడం.. ఆ కమిటీ వరుసగా సమావేశాలు అవుతూ.. వివిధ సమస్యలపై చర్చించడం జరుగుతోంది.. మరోవైపు.. ఏ విషయమైనా కుండ బద్దలు కొట్టినట్టుగానే మాట్లాడే వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్‌ వర్మ కూడా ఈ వ్యవహారంలో ఎంట్రీ ఇచ్చాడు.. కొన్ని సందర్భాల్లో మైక్‌ పట్టి తన అభిప్రాయాలు చెబుతూ.. ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేసిన ఆర్జీవీ.. ఇక, సోషల్‌ మీడియా వేదికగా కూడా రచ్చ చేశారు.. ఆర్జీవీ, మంత్రి పేర్నినాని మధ్య సినిమా టికెట్ల వ్యవహారంలో ట్వీట్ల యుద్ధమే జరిగింది.. చివరకు ఓసారి కలిసి మాట్లాడుకుందామనే నిర్ణయానికి వచ్చిన మంత్రి పేర్నినాని, ఆర్జీవీ.. నిన్న సమావేశమై సుదీర్ఘంగా మంతనాలు జరిపారు.. వారి భేటీలో ఆసక్తికరమైన చర్చ సాగింది..

Read Also: పెరుగుతోన్న కరోనా కేసులు.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

మంత్రి పేర్ని నానితో వర్మ సుదీర్ఘ భేటీలో అనేక అంశాలను ప్రస్తావించారు.. సినిమా టిక్కెట్ల ధరలు.. ప్రభుత్వ పెత్తనం సహా వివిధ అంశాలపై పేర్ని-వర్మ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది.. సినిమా సమస్యలే కాకుండా.. ఇతర అంశాల పైనా మంత్రి-దర్శకుల భేటీలో చర్చ సాగింది.. టిక్కెట్‌ ధరలు నిర్ణయించే అధికారం ప్రభుత్వానికి ఎక్కడదని నేరుగా మంత్రిని ప్రశ్నించారు ఆర్జీవీ.. అయితే, గతం నుంచి వివిధ ప్రభుత్వాలు ఇచ్చిన జీవోలు.. చట్టాలను వర్మ ముందు పెట్టారు పేర్ని నాని.. తాము చట్టంలో ఉన్నదే చేస్తున్నాం తప్ప.. కొత్తగా చట్టాలు చేయలేదని ఆయన స్పష్టం చేస్తే.. అసలు ఇలా ఎలా ఉంటుందంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు ఆర్జీవీ.. ఇలాగే ఉంటాయని.. చాలా కాలం క్రితం కేంద్ర, రాష్ట్రాలు చట్టాలు చేశాయని మంత్రి వివరించారు.. మరి ముంబైలో ఓ టిక్కెట్‌ ధరను రూ. 2200 కూడా అమ్ముతున్నారని వర్మ వ్యాఖ్యానించగా.. ముంబైలో ఒక థియేటర్‌లోనే టిక్కెట్‌ ధర రూ. 2200 ఉంటుందని.. మిగతా అన్ని చోట్ల ఎలా ఉందో చూడాలి కదా? అంటూ కౌంటర్‌ ఇచ్చారు పేర్ని.. ఏపీలో కూడా మల్టీప్లెక్సుల్లో రూ. 250 ధర ఉన్న విషయాన్ని ప్రస్తావించకుండా.. పల్లెల్లో నాన్ ఏసీ థియేటర్‌కు ఫిక్స్‌ చేసిన రూ. 5 ధరనే ఎందుకు ప్రస్తావిస్తారని ఆర్జీవీని నిలదీశారు.. కూరగాయలు పండించుకునే రైతులు కూడా రైతు బజార్‌లోకి వస్తే ప్రభుత్వం నిర్దేశించిన ధరకే అమ్మాలని మంత్రి స్పష్టం చేశారు. అయితే, ఆర్ఆర్ఆర్, పుష్ప, రాథే శ్యామ్‌ వంటి భారీ బడ్జెట్‌ సినిమాలకు టిక్కెట్‌ ధరల తగ్గింపు వల్ల నష్టం చేకూరదా..? అని ఆర్జీవీ ప్రశ్నించగా.. పెట్టిన పెట్టుబడి అంతా వారం పది రోజుల్లోనే రాబట్టుకోవాలనే తాపత్రయం వల్ల జరిగే పరిణామాలని.. గతంలో ఇలా ఉండేది కాదు కదా అంటూ గతంలో సినిమాల ప్రదర్శన వంటి అంశాలను గుర్తు చేశారు మంత్రి.

మరోవైపు, సినిమా టిక్కెట్లను నియంత్రించినట్టు విద్యా, వైద్యం వంటి వాటి విషయాల్లో ఎందుకు నియంత్రించడం లేదని సూటిగా ప్రశ్నించారు ఆర్జీవీ.. అయితే, స్కూల్‌, కాలేజ్‌ ఫీజులను కూడా రెగ్యులేట్‌ చేస్తున్నామంటూ మంత్రి నాని వివరించగా.. నిజమా..? ఇది జరుగుతుందా..? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు ఆర్జీవీ… ఈ సందర్భంగా స్కూల్‌, కాలేజ్‌ ఫీజుల కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను డాక్యుమెంట్లతో సహా ఆర్జీవీ ముందు పెట్టారు.. ఇక, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విధానం గురించి కూడా ఆర్జీవీ ఆరా తీశారు.. ఫీజు రీ-యింబర్సుమెంట్‌ విధానం.. కాలేజీల్లో మేనేజ్మెంట్‌ కోటా వంటి విషయాలను ఆర్జీవీకి వివరించారు.. అయితే, హీరోల రెమ్యూనరేషన్‌ను కట్టడి చేయాలని ప్రభుత్వం ఎందుకు భావిస్తోందన్న వర్మ అసలు ప్రశ్న లేవనెత్తారు.. కానీ, హీరోల రెమ్యూనరేషన్‌ గురించి ప్రభుత్వం ఏమీ పట్టించుకోవడం లేదని.. అది తమకు సంబంధించిన అంశం కాదని స్పష్టం చేశారు మంత్రి పేర్ని నాని.. ఇదే సందర్భంలో మంత్రి అనిల్‌ కామెంట్లను ఆర్జీవీ గుర్తు చేయగా.. ప్రభుత్వ నిర్ణయాలను చూడాలి తప్ప.. వ్యక్తిగతంగా మేం చేసే కామెంట్లను పట్టించుకోవద్దని ఆర్జీవీకి సూచించారు మంత్రి పేర్నినాని.. మీడియా ప్రశ్నలకు సమాధానంగానో.. మరో కారణంగానో రకరకాల కామెంట్లు వస్తాయని.. దాన్ని ప్రభుత్వ నిర్ణయంగా చూడకూడదన్న స్పష్టం చేశారు.. ఇక, ఇద్దరి మధ్య జరిగిన పలు ఆసక్తికర అంశాలకు సంబంధిచిన వివరాల కోసం కింది వీడియోను క్లిక్ చేయండి..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • Minister Perni Nani and RGV Meeting
  • movie tickets
  • Perni Nani
  • Perni Nani and RGV

తాజావార్తలు

  • US Iran Conflict: ఇస్లామాబాద్ చర్చలు అట్టర్ ఫ్లాప్.. అమెరికా-ఇరాన్ మధ్య కుదరని డీల్! ఇక బాంబుల మోత తప్పదా?

  • KTR : వచ్చే ఎన్నికల్లో పొత్తులపై స్పష్టతనిచ్చిన కేటీఆర్

  • MI vs RCB: కోహ్లీ వర్సెస్ రోహిత్.. టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న ముంబై!

  • GTvsLSG: గిల్ క్లాస్.. బట్లర్ మాస్.. లక్నోను చిత్తు చేసిన గుజరాత్ ఓపెనర్లు..

  • Donald Trump: “హోర్ముజ్‌ మూసేస్తాం”.. ట్రంప్ వార్నింగ్‌తో ప్రపంచం టెన్షన్..

ట్రెండింగ్‌

  • Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!

  • Super Juice: వేసవి వేడికి ఈ పండు రసమే ‘రామబాణం’.. బరువు తగ్గడమే కాదు, ముఖం కూడా మెరిసిపోతుంది.!

  • అమృతం ఎక్కడో లేదు.. మీ వంటింట్లోనే ఉంది..! వేసవిలో ఈ ఒక్క గ్లాసు పానీయం చేసే మ్యాజిక్..!

  • Parenting Tips: తల్లిదండ్రులూ తస్మాత్ జాగ్రత్త! రిజల్ట్స్ వచ్చేశాయ్.. పిల్లల ప్రవర్తనను గమనించండి!!

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions