Site icon NTV Telugu

Indigo Airlines: క‌డ‌ప‌-విజ‌య‌వాడ మ‌ధ్య విమాన స‌ర్వీసులు ప్రారంభం

కడప నుంచి విజయవాడకు విమాన సర్వీసులను ప్రారంభించినట్లు ఇండిగో ఎయిర్‌లైన్స్ వెల్లడించింది. ప్రతి ఆదివారం, సోమ‌వారం, బుధవారం, శుక్రవారం.. అంటే వారానికి నాలుగురోజుల పాటు గ‌న్నవ‌రం నుంచి క‌డ‌ప‌కు విమాన స‌ర్వీసులు న‌డుస్తాయ‌ని ఇండిగో అధికారులు ప్రక‌టించారు. ఈ మేర‌కు ఏపీ ప్రభుత్వం ఇండిగో, ఏపీ ఎయిర్‌పోర్టు డెవ‌ల‌ప్ మెంట్ కార్పొరేష‌న్ లిమిటెడ్‌తో ఒప్పందాలు చేసుకుంది.

మరోవైపు కడప నుంచి విజయవాడకే కాకుండా హైదరాబాద్, చెన్నై, విశాఖ, బెంగళూరు నగరాలకు కూడా విమాన సర్వీసులను నడుపుతామని ఇండిగో ఎయిర్‌లైన్స్ సంస్థ తెలియజేసింది. కాగా గతంలో విజయవాడ-కడప మధ్య ట్రూజెట్ విమాన సర్వీసులను నడిపింది. అయితే ట్రూజెట్ ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. దీంతో ఇండిగోకు అవకాశం వచ్చింది. ఈ విమాన సర్వీసులను నడిపేందుకు ఏపీ ప్రభుత్వం రూ. 20 కోట్ల మొత్తాన్ని వయబిలిటీ గ్యాప్ ఫండ్ (వీజీఎఫ్) కింద ఇండిగో కంపెనీకి చెల్లించనుంది.

https://ntvtelugu.com/ap-teachers-eligibility-test-likely-to-be-conducted-in-june-month/
Exit mobile version