Site icon NTV Telugu

ఏపీలో కొత్తగా 54 కరోనా కేసులు

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో కరోనా మహమ్మారి కేసులు తగ్గు ముఖం పడుతున్నాయి. నిన్నటి కంటే ఇవాళ భారీగా పడి పోయాయి కరోనా మహమ్మారి కేసులు. తాజాగా ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. రాష్ట్రంలో కొత్తగా గడిచిన 24 గంటల లో కొత్తగా 54 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఆంధ్ర ప్రదేశ్‌ లో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,76,546 కి పెరిగింది.

ఒక్క రోజు వ్యవధిలో కరోనా కారణంగా ఒక్కరు కూడా మరణించలేదని తెలిపింది. కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14,490 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1099 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 121 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 20,60,957 లక్షలకు చేరింది. ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 17,940 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 3,11,99,604 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.

https://ntvtelugu.com/rewant-reddy-criticized-trs-leaders-for-protesting-his-arrest


Exit mobile version