Site icon NTV Telugu

వాయుగుండం ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు

వాయుగుండం ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురవనున్నాయి. వాతావరణ శాఖ కోస్తాంధ్ర, రాయలసీమకు భారీ వర్ష సూచన చేసింది. అధికారులు, మత్స్యకారులు అప్రమత్తంగా వుండాలని సూచించింది. అండమాన్‌ సముద్రంలో రేపు మరో అల్పపీడనం ఏర్పడనుంది. ఈ నెల 17న అల్పపీడనం తీరం దాటనుంది. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురవనున్నాయి.

ఇటు ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. అన్ని స్కూళ్లు, కాలేజీలకు అధికారులు ఇవాళ సెలవు ప్రకటించారు. మరో 24 గంటలపాటు ఏపీపై వాయుగుండం ప్రభావం చూపనుంది. వాయుగుండం ప్రభావంతో పలు జిల్లాల్లో భారీవర్షాలు కురవనున్నాయి. తెలంగాణలో నేటి నుంచి మూడు రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. వాయుగుండం ప్రభావంతో తమిళనాడులో కుండపోత వర్షాలు కురవనున్నాయి.

Exit mobile version