Kodali Nani: చిరంజీవిని విమర్శించే సంస్కారహీనుడను కాను
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kodali Nani: మెగాస్టార్ చిరంజీవిని విమర్శించేంత సంస్కారహీనుడును తాను కానని ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. చిరంజీవిని తాను విమర్శించినట్లు నిరూపించాలని కొడాలి నాని చాలెంజ్ చేశారు. చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా మంగళవారం గుడివాడలో చిరంజీవి పుట్టిన రోజు కార్యక్రమాల్లో మాజీ మంత్రి పాల్గొన్నారు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా కొడాలి నాని కేక్ కట్ చేశారు. అనంతరం చిరంజీవి అభిమానులకు పంచారు. ఈ సందర్భంగా కొడాలి నాని చిరంజీవి గురించి మాట్లాడారు.
Read also: Rohit Sharma: ప్రపంచకప్ 2023లో రోహిత్, కోహ్లీ బౌలింగ్ చేస్తారు.. అగార్కర్ గ్రీన్ సిగ్నల్!
Also Read
- YS Jagan: తూర్పు గోదావరిలో వైఎస్ జగన్ పర్యటన.. పొగాకు కొనుగోళ్లపై సమీక్ష, రైతులతో ముఖాముఖి!
- Minister Narayana: సీఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు.. అమరావతికి కొత్త ఊపు
- Nara Lokesh: మంత్రి లోకేష్‌తో చాగంటి కోటేశ్వరరావు భేటీ.. నైతిక విలువలతోనే విద్యా వికాసం
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలపై ఎస్ఈసీ క్లారిటీ.. అప్పుడేనా..?
తాను శ్రీరామ అన్నా కూడా టీడీపీ, జనసేన పార్టీల నేతలకు బూతు మాటలుగా వినపడతాయని కొడాలి నాని మండిపడ్డారు. తానేం మాట్లాడానో చిరంజీవికి, ఆయన అభిమానులకు తెలుసునని.. తామంతా క్లారిటీ గానే ఉన్నామని స్పష్టం చేశారు. రాజకీయంగా చిరంజీవి విమర్శిస్తే ఏం జరుగుతుందో తనకు తెలుసునన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, తమ గురించి మాట్లాడితే ఎంతటి వారినైనా చీల్చి చెండాడతానని హెచ్చరించారు. ఎవరి జోలికి వెళ్ళని పెద్దాయన చిరంజీవని.. ఆయనను విమర్శించే సంస్కారహీనుడను కాదని నాని స్పష్టం చేశారు. చిరంజీవి అభిమానుల ముసుగులో టీడీపీ, జనసేన శ్రేణులు గుడివాడ రోడ్లు మీద దొల్లారని విమర్శించారు. చిరంజీవికి ,తమకు మధ్య అగాధం సృష్టించాలని టీడీపీ, జనసేన కుట్రలు చేస్తోందని విమర్శించారు. ప్రజారాజ్యం తరఫున తన కార్యాలయం మీదుగా ర్యాలీగా వెల్లిన చిరంజీవికు చేతులెత్తి నమస్కారం పెట్టానని కొడాలి నాని గుర్తు చేశారు. అనేక సందర్భాల్లో తాను చిరంజీవిని కలిశానని చెప్పారు. పెద్దాయనగా చిరంజీవి చెప్పే సూచనలు పాటిస్తామన్నారు. తమకు ఇచ్చినట్లే…. డ్యాన్సులు, నటన చేతకాని ఇండస్ట్రీలోని పకోడీ గాళ్ళకు కూడా చిరంజీవి సలహాలు ఇవ్వాలనే చెప్పానని కొడాలి నాని స్పష్టం చేశారు. ఇండస్ట్రీలో శిఖరాగ్రాన ఉన్న చిరంజీవికి డాన్సులు, యాక్షన్ రాదా? తాను ఆయన గురించి మాట్లాడినట్లు ఎట్లా అవుతుందని కొడాలి నాని ప్రశ్నించారు. తన వెంట ఉన్న వారిలో 60 శాతం మంది చిరంజీవి అభిమానులేనని కొడాలి నాని అన్నారు.
తాజావార్తలు
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్‌కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
Varanasi: మహేష్ పుట్టినరోజుకు ‘వారణాసి’ గిఫ్ట్ ఉంటుందా?.. 80% షూటింగ్ పూర్తయినా పోస్టర్ తో సరిపెట్టుకుంటారా ?
-
TVS iQube Price Hike: టీవీఎస్ iQube ధర పెంపు.. 212KM రేంజ్, 32 లీటర్ల స్టోరేజ్.. కొత్త ధరలు ఇవే!
-
Ramayana : మరో వివాదంలో రామాయణ.. తమకు సినిమా చుపించాల్సిదేనని ‘శ్రీ రామ్‌లీలా మహాసంఘ్’ డిమాండ్
ట్రెండింగ్
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్‌తో Lava Probuds Xplore 25° TWS ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!