Site icon NTV Telugu

Kodali Nani: చిరంజీవిని విమర్శించే సంస్కారహీనుడను కాను

Kodali Nani

Kodali Nani

Kodali Nani: మెగాస్టార్‌ చిరంజీవిని విమర్శించేంత సంస్కారహీనుడును తాను కానని ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. చిరంజీవిని తాను విమర్శించినట్లు నిరూపించాలని కొడాలి నాని చాలెంజ్ చేశారు. చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా మంగళవారం గుడివాడలో చిరంజీవి పుట్టిన రోజు కార్యక్రమాల్లో మాజీ మంత్రి పాల్గొన్నారు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా కొడాలి నాని కేక్‌ కట్‌ చేశారు. అనంతరం చిరంజీవి అభిమానులకు పంచారు. ఈ సందర్భంగా కొడాలి నాని చిరంజీవి గురించి మాట్లాడారు.

Read also: Rohit Sharma: ప్రపంచకప్‌ 2023లో రోహిత్, కోహ్లీ బౌలింగ్ చేస్తారు.. అగార్కర్ గ్రీన్ సిగ్నల్!

తాను శ్రీరామ అన్నా కూడా టీడీపీ, జనసేన పార్టీల నేతలకు బూతు మాటలుగా వినపడతాయని కొడాలి నాని మండిపడ్డారు. తానేం మాట్లాడానో చిరంజీవికి, ఆయన అభిమానులకు తెలుసునని.. తామంతా క్లారిటీ గానే ఉన్నామని స్పష్టం చేశారు. రాజకీయంగా చిరంజీవి విమర్శిస్తే ఏం జరుగుతుందో తనకు తెలుసునన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి, తమ గురించి మాట్లాడితే ఎంతటి వారినైనా చీల్చి చెండాడతానని హెచ్చరించారు. ఎవరి జోలికి వెళ్ళని పెద్దాయన చిరంజీవని.. ఆయనను విమర్శించే సంస్కారహీనుడను కాదని నాని స్పష్టం చేశారు. చిరంజీవి అభిమానుల ముసుగులో టీడీపీ, జనసేన శ్రేణులు గుడివాడ రోడ్లు మీద దొల్లారని విమర్శించారు. చిరంజీవికి ,తమకు మధ్య అగాధం సృష్టించాలని టీడీపీ, జనసేన కుట్రలు చేస్తోందని విమర్శించారు. ప్రజారాజ్యం తరఫున తన కార్యాలయం మీదుగా ర్యాలీగా వెల్లిన చిరంజీవికు చేతులెత్తి నమస్కారం పెట్టానని కొడాలి నాని గుర్తు చేశారు. అనేక సందర్భాల్లో తాను చిరంజీవిని కలిశానని చెప్పారు. పెద్దాయనగా చిరంజీవి చెప్పే సూచనలు పాటిస్తామన్నారు. తమకు ఇచ్చినట్లే…. డ్యాన్సులు, నటన చేతకాని ఇండస్ట్రీలోని పకోడీ గాళ్ళకు కూడా చిరంజీవి సలహాలు ఇవ్వాలనే చెప్పానని కొడాలి నాని స్పష్టం చేశారు. ఇండస్ట్రీలో శిఖరాగ్రాన ఉన్న చిరంజీవికి డాన్సులు, యాక్షన్ రాదా? తాను ఆయన గురించి మాట్లాడినట్లు ఎట్లా అవుతుందని కొడాలి నాని ప్రశ్నించారు. తన వెంట ఉన్న వారిలో 60 శాతం మంది చిరంజీవి అభిమానులేనని కొడాలి నాని అన్నారు.

Exit mobile version