NTV Telugu Site icon

Toll Charges: హైదరాబాద్‌-విజయవాడ హైవేపై తగ్గిన టోల్‌ ధరలు..

Toll Gate

Toll Gate

Toll Charges: హైదరాబాద్‌- విజయవాడ జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనదారులకు గుడ్ న్యూస్. ఈ రూట్ లో వెళ్లే వాహనాలకు టోల్‌ ఛార్జీలను తగ్గిస్తూ ఎన్‌హెచ్‌ఏఐ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో తగ్గిన టోల్‌ చార్జీలు సోమవారం అర్ధరాత్రి ( మార్చ్ 31) నుంచి అమలులోకి రాబోతున్నాయి. తగ్గిన చార్జీలు ఏప్రిల్‌ 1వ తేదీ 2025 నుంచి మార్చి 31వ తేదీ 2026 వరకు అమలులో ఉంటాయి. ఇక, హైదరాబాద్‌-విజయవాడ నేషనల్ హైవేపై తెలంగాణలో పంతంగి, కొర్లపహాడ్, ఏపీలో చిల్లకల్లు వద్ద టోల్‌గేట్లు ఉన్నాయి.

Read Also: Prashant Kishor: ‘ద్రోహి’ అనడంలో తప్పేముంది? కునాల్ కమ్రాకు ప్రశాంత్ కిషోర్ మద్దతు

ఇక, ఈ క్రమంలో పంతంగి టోల్‌ ప్లాజా దగ్గర కార్లు, జీపులు, వ్యాన్‌లకు ఒక వైపు ప్రయాణానికి రూ.15, ఇరు వైపులా కలిపి రూ.30, లైట్‌ వేయిట్‌ వాహనాలను ఒక వైపు ప్రయాణానికి రూ.25, ఇరువైపులా కలిపి రూ.40, బస్సు, ట్రక్కులకు ఒక వైపు ప్రయాణానికి రూ.50, ఇరువైపులా కలిపి రూ.75 వరకు తగ్గించినట్లు ప్రకటించారు. అయితే, చిల్లకల్లు టోల్‌ప్లాజా దగ్గర అన్ని వాహనాలకు కలిపి ఒక వైపునకు రూ.5, ఇరువైపులా కలిపి రూ.10 చొప్పున మాత్రమే రేట్లు తగ్గించారు. 24 గంటలలోపు తిరుగు ప్రయాణం చేస్తే అన్ని రకాల వాహనాలకు టోల్‌ ఛార్జీలో 25 శాతం మినహాయింపు ఇవ్వనున్నట్లు తెలిపారు.

Read Also: HCU: టెన్షన్..టెన్షన్.. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళనలు

కాగా, గతంలో ప్రతీ ఏప్రిల్ 1వ తేదీన టోల్ చార్జీలు పెంచిన‌ జీఎంఆర్.. 2024 జూన్ 31తో ఆ సంస్థ ఒప్పందం ముగిసిపోయింది. అయితే, హైవే-65ను బీవోటీ పద్ధతిలో నిర్మించడంతో 2012 డిసెంబర్ నుంచి టోల్ ధరలు వసూలు చేసిన జీఎంఆర్.. ఒప్పందం 2024లో‌ ముగియడంతో ఏడాది పాటు నిర్వాహణను ఏజెన్సీలకు ఎన్‌హెచ్ఏఐ అప్పగించింది. దీంతో, ఎన్‌హెచ్‌ఏఐ టోల్ నిర్వహణను చేపడుతుండటంతో ఈ ఛార్జీలు తగ్గుముఖం పట్టాయి. టోల్ రేట్లు తగ్గించడంతో వాహనదారులకు కాస్త ఊరట లభించినట్లైంది.