NTV Telugu Site icon

Malleshwari Case: పరాయి వ్యక్తితో ఎఫైర్ పెట్టుకుందని.. భర్త ఏం చేశాడంటే?

Husband Killed Wife

Husband Killed Wife

Husband Killed His Wife Malleshwari For Having Affair With Fastfood Worker: రెండు వారాల నుంచి మిస్టరీగా మారిన ఓ కేసుని పోలీసులు ఎట్టకేలకు ఛేధించారు. పరాయి వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో.. మరో వ్యక్తి సహాయంతో స్వయంగా భర్తే ఆ మహిళని హతమార్చినట్టు పోలీసులు తేల్చారు. ఆ వివరాల్లోకి వెళ్తే.. గతంలో నాగబాబు, మల్లేశ్వరిలకు వేర్వేరుగా పెళ్లిళ్లు జరిగాయి. అయితే.. తమ భాగస్వామ్యులతో విభేదాలు ఏర్పడటంతో వాళ్లు విడాకులు తీసుకున్నారు. అనంతరం నాగబాబు, మల్లేశ్వరి దగ్గరయ్యారు. ఈ క్రమంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించడంతో.. వీళ్లు సహజీవనం చేయడం మొదలుపెట్టారు. ఈ జంటకి రెండున్నరేళ్ల కుమార్తె కూడా ఉంది. కట్ చేస్తే.. గతంలో నాగబాబు అమలాపురంలో ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వహించినప్పుడు, అందులో పని చేసే వ్యక్తితో మల్లేశ్వరికి కూడా పరిచయం ఉండేది. వీళ్లిద్దరు స్నేహితుల్లాగే మెలిగే వారు. అయితే.. నాగబాబుకి మాత్రం మల్లేశ్వరిపై అనుమానం కలిగింది. ఆ వ్యక్తితో మరీ సన్నిహితంగా ఉండటంతో.. అతనితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందనే అనుమానం పెంచుకున్నాడు.

Manipur Violence: మ‌ణిపూర్లో ఆగని కాల్పుల మోత.. స్కూల్, ఇండ్లు దగ్ధం

ఇదిలావుండగా.. ఈ నెల 7వ తేదీ రాత్రి ఇంటి నుంచి వెళ్లిన మల్లేశ్వరి తిరిగి ఇంటికి రాకపోవడం, ఎక్కడా ఆచూకీ కనిపించకపోవడంతో.. ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు ఇచ్చాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆమె కోసం గాలించడం మొదలుపెట్టారు. భర్త నాగబాబు కూడా పోలీసులతో కలిపి గాలించాడు. ఈ క్రమంలోనే 9వ తేదీన ఉదయం అమలాపురం బైపాస్‌ రోడ్డులో పంట కాలువ నీటి అంచున మల్లేశ్వరి మృతదేహం కనిపించింది. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎన్ని కోణాల్లో విచారించినా.. ఆమె మృతికి గల కారణాల్ని మాత్రం పోలీసులు తెలుసుకోలేకపోయారు. ఫైనల్‌గా పోస్టుమార్టం రిపోర్ట్‌లో ఆమెది హత్యేనని తేలడంతో.. పోలీసులు తమ విచారణని వేగవంతం చేశారు. భర్త పొంతనలేని సమాధానాలు ఇవ్వడంతో.. అతనిపై పోలీసులకు అనుమానం కలిగింది. దీంతో.. అతడ్ని అదుపులోకి తీసుకొని, తమదైన శైలిలో విచారించారు. అప్పుడు నాగబాబు అసలు నిజం కక్కాడు. తానే అనుమానంతో తన భార్యని హతమార్చినట్టు అంగీకరించాడు.

Health Tips : ఉసిరి పొడిని ఇలా తీసుకుంటే చాలు.. ఆ సమస్యలన్నీ మాయం..

మల్లేశ్వరి కనిపించకుపోయిన రోజే నాగబాబు ఆమెని హత్య చేసినట్టు తెలిపాడు. తాముంటున్న ఇంట్లోనే మల్లేశ్వరి మెడకు చీర బిగించి, ఆమెని హతమార్చాడు. అతనికి ఆ ఇంటి యాజమాని కుమారుడు కముజు నరసింహం కూడా సహకరించాడు. మల్లేశ్వరి చనిపోయాక.. ఆమె ఒంట్లో బాగోలేదని, ఆస్పత్రికి తీసుకువెళుతున్నామని ఇరుగుపొరుగు వారికి అబద్ధం చెప్పి.. మోటారు సైకిల్‌పై ఆమె మృతదేహాన్ని నాగబాబు, నరసింహం తీసుకువెళ్లారు. పంట కాలువ వద్దకు వెళ్లి మృతదేహాన్ని పడేశారు. కాలువ నుంచి సముద్రంలో కొట్టుకుపోతుందని వాళ్లు భావించారు కానీ, అది నీటి అంచునే ఆగిపోవడంతో వీరి బండారం బయటపడింది. పోలీసులు నిందితుల్ని అరెస్ట్ చేసి, కోర్టులో హాజరు పరిచారు. కోర్టు రిమాండ్‌ విధించడంతో వారిని సెంట్రల్‌ జైలుకు తరలించారు.

Show comments