Husband Kidnapped By Wife Lover And Tortured: సాధారణంగా తమ భార్య వైపు ఇతర మగాడు కన్నెత్తి చూస్తేనే భర్తలకు కోపం వస్తుంది. అలాంటిది.. వివాహేతర సంబంధం పెట్టుకుంటే, చూస్తూ ఊరికే ఉంటాడా? తప్పకుండా తనదైన రీతిలో ఇద్దరికి బుద్ధి వచ్చేలా గుణపాఠం చెప్తాడు. మరీ ముఖ్యంగా.. తన భార్యతో సంబంధం పెట్టుకున్న వ్యక్తికి తగిన శాస్తి చేస్తాడు. తిరుపతికి చెందిన ఓ వ్యక్తి కూడా అదే పని చేశాడు. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నందుకు కోపంతో రగిలిపోయిన అతను, సోషల్ మీడియాలో భార్య ప్రియుడిపై ఓ ప్రచారం చేశాడు. అయితే.. ఆ పోస్టింగ్స్ చూసి మండిపోయిన భార్య ప్రియుడు, ఎవ్వరూ ఊహించని దారుణానికి ఒడిగట్టాడు. ఆ వివరాల్లోకి వెళ్తే..
Fire Accident: ఘోర అగ్నిప్రమాదం.. 17 మంది దుర్మరణం, 50 మందికి గాయాలు
తిరుపతిలోని చంద్రగిరికి చెందిన బాధితుడు.. బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు. ఓవైపు భర్త కుటుంబ పోషణ కోసం బెంగుళూరులో పని చేస్తుంటే, అతని భార్య మాత్రం అన్వర్ వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్త ఇంట్లో లేనప్పుడు.. ప్రియుడ్ని ఆమె ఇంటికి పిలిపించుకునేది. అయితే.. వీరి బాగోతం ఎంతోకాలం దాగి ఉండలేదు. భర్తకు వీరి విషయం తెలిసిపోయింది. మరోసారి అన్వర్‌తో కలవొద్దని తన భార్యను మందలించాడు. అయినా భార్య ప్రవర్తనలో మార్పు రాలేదు. అన్వర్‌తో వివాహేతర సంబంధం కొనసాగించింది. దీంతో కోపాద్రిక్తుడైన భర్త.. అన్వర్‌పై పగ పెంచుకున్నాడు. ఆ కోపంలోనే సోషల్ మీడియాలో RIP అంటూ అన్వర్‌పై పోస్టింగ్స్ పెట్టాడు. కనీసం ఆ పోస్టింగ్స్ చూసి అయినా, అన్వర్ తన భార్యకు దూరం అవుతాడని భర్త భావించాడు.
Whats Today: ఈరోజు ఏమున్నాయంటే..?
కానీ.. ఆ పోస్టింగ్స్ చూసి రగిలిపోయిన అన్వర్, తన స్నేహితుడు వంశీ చౌదరి సహకారంతో బాధితుడ్ని కిడ్నాప్ చేశాడు. బెంగుళూరులో ఉన్న అతడ్ని, చంద్రగిరికి తీసుకొచ్చాడు. అతని తలపై మూత్రం పోసి, గుండు గీయించి, అత్యంత దారుణంగా చితకబాదాడు. అంతేకాదు.. తానే గుండు గీయించుకున్నానని, ఏం జరిగినా దానికి తానే బాధ్యుడినంటూ భర్తతో వీడియో కూడా తీయించాడు. ఈ వీడియోల్ని సోషల్ మీడియాలో పెట్టాడు. ఇవి వైరల్ అవ్వడంతో.. పోలీసులు రంగంలోకి దిగారు. విచారణ చేపట్టి.. నిందితులైన అన్వర్, వంశీలను అదుపులోకి తీసుకున్నారు.