NTV Telugu Site icon

Sister idol installed: అక్కంటే ప్రాణం.. రాఖీ పండుగ రోజు విగ్రహం ఆవిష్కరణ..

Sister Idol Installed

Sister Idol Installed

అనుబంధానికి ప్రతీక రాఖీ పౌర్ణమి.. దేశవ్యాప్తంగా చాలా ఘనంగా రాఖీ పౌర్ణమి జరుపుకుంటారు. రాఖీ పౌర్ణమి, రక్షాబంధన్, రాఖీగా పిలవబడే ఈ పండుగ సోదర సోదరీమణులు అత్యంత పవిత్రంగా, వారి బంధం పటిష్టంగా ఉండాలని నిర్వహిస్తారు.. సోదర సోదరీమణులు ఒకరికి ఒకరు అండగా ఉంటామని భరోసా ఇచ్చే పండుగ ఇది… మానవ సంబంధాలకు, అనుబంధాలకు ప్రతీకగా నిలుస్తుంది.. మెట్టినింటికి వెళ్లిన తర్వాత పుట్టినింటికి దూరమైన ప్రతీ ఆడపడుచు ఈ పండుగ రోజు ఖచ్చితంగా తన పుట్టింటికి వచ్చే రోజు ఇదే అని చెప్పాలి.. అన్నా చెల్లెళ్ళు , అక్కా తమ్ముళ్ళ మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా జరుపుకునే పండుగ రోజు.. తన జీవితంలో జరిగిన ఓ ఘటనను గుర్తుచేసుకున్న ఓ సోదరుడు.. నాలా మరొకరికి జరగ కూడదని.. ప్రచారం నిర్వహిస్తున్నాడు.. అంతే కాదు.. తన అక్కపై ఉన్న ప్రేమని.. ఓ విగ్రహంగా మార్చి.. ఇంటి దగ్గర ఆవిష్కరించాడు..

Read Also: Chikoti Praveen Petition: ఈడీ దర్యాప్తు పూర్తయ్యే వరకు పోలీస్ భద్రత కావాలి..!

అక్కను మర్చిపోలేక ఆమె విగ్రహాన్ని ఆవిష్కరించిన తమ్ముడి విషానికి వస్తే.. కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రమాదంలో మరణించిన అక్క విగ్రహాన్ని తయారు చేయించి రాఖీ సందర్భంగా ఆవిష్కరించాడు తమ్ముడు..శంఖవరం మండలం కత్తిపూడి గ్రామానికి చెందిన మణి.. బైక్ ప్రమాదంలో మృతి చెందింది.. బైక్‌పై వెళ్తుండగా.. చున్ని బైక్ చక్రంలో ఇరుక్కుని కొందపడిపోయి ఆమె ప్రాణాలు విడిచింది.. అయితే, తన సోదరిలా ఎవరికీ జరగ కాకూడదని సోషల్ మీడియాలో ప్రచారం నిర్వహిస్తున్నాడు తమ్ముడు రాజా.. రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆమె విగ్రహాన్ని గ్రామంలో ఊరేగించి ఇంటిదగ్గర ఆవిష్కరించాడు.. తన సోదరిపై తనకున్న ప్రేమను చాటుతూనే.. ఆమె తనకు దూరమైన గడియలను గుర్తు చేసుకుంటూ.. మరొకరి జీవితంలో ఇలాంటి పరిస్థితి రాకూడదు అంటున్నారు రాజా..

Show comments