NTV Telugu Site icon

Ysrcp Vs Tdp: గోరంట్ల వివాదంతో అనంతలో టెన్షన్ టెన్షన్

Tdp Ysrcp

Tdp Ysrcp

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే టాపిక్.. ఎంపీ మాధవ్ న్యూడ్ వీడియో పై డిస్కషన్స్. ఇక వైసీపీనైతే ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రాష్ట్రంలో టీడీపీ నేతలకు ఒక ఛాన్స్ ఇచ్చినట్టైంది. అందుకే వారు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలతో హోరెత్తిస్తున్నారు. ఇక అనంతపురం జిల్లాలో అయితే టీడీపీ నేతల నిరసనలతో రగులుతోంది. ఇది ఇటు తిరిగి ఇటు తిరిగి కుల రాజకీయాలకు కూడా పాకింది. ఎంపీ మాధవ్ అనుచరలైతే ఇప్పటికీ ఇది మార్ఫింగేనని వాదిస్తుండగా.. టీడీపీ నేతలైతే ఇంకా బుకాయిస్తారా సిగ్గుంటే రాజీనామాలు చేయాలంటూ పరుష పదజాలంతో విమర్శలు చేస్తున్నారు..

హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో ఇప్పుడు రాష్ట్రంలో పెద్ద దుమారం రేపుతోంది. ప్రత్యేకించి ఇది వైసీపీకి చాలా ఇబ్బందికరంగా మారింది. ఎప్పుడూ తన మాటలు, చేతలతో న్యూస్ లో ఉండే మాధవ్ ఇప్పుడు ఒక వీడియోతో అనంతపురం నుంచి ఢిల్లీ వరకు మారు మ్రోగేలా చేస్తున్నారు. ఎంపీ మాధవ్ వీడియో లీకైన క్షణం నుంచి టీడీపీ నేతలు పాయింట్ బ్లాక్ చేస్తూ వైసీపీ అధిష్టానాన్ని ఇరుకున పెడుతున్నారు.

PM Modi: ఇది ఎమోషనల్ మూమెంట్.. వెంకయ్య సాక్షిగా సభలో అనేక చారిత్రక ఘటనలు..

ప్రత్యేకించి అనంతపురం జిల్లా వ్యాప్తంగా నిరసనలతో హోరెత్తించారు. హిందూపురం నుంచి మొదలైన నిరసనలు.. అన్ని ప్రాంతాలకు పాకాయి. హిందూపురంలో టిడిపి నాయకులు అంబేద్కర్ సర్కిల్లో ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఎంపీ మాధవ్ చిత్రపటంపై చెప్పులతో కొట్టిన మహిళలు తీవ్ర స్థాయిలో విరుచకుపడ్డారు. సిగ్గు, చరం ఉంటే ఎంపీ పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎంపి గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో వివాదంపై సత్యసాయి జిల్లా కదిరి టీడీపీ ఇంచార్జ్ కందికుంట వెంకటప్రసాద్ ఆధ్వర్యంలో మహిళలు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించి మాధవ్ ను అరెస్ట్ చేయాలంటూ ఫిర్యాదు చేశారు…

అనంతపురం జిల్లా కేంద్రంలో సప్తపరి సర్కిల్ వద్ద దిష్టిబొమ్మ, ఫోటోలతో టీడీపీ నేతలు ప్రదర్శన నిర్వహించారు. ష్టిబొమ్మను దహనం చేసి తమ నిరసన వ్యక్తం చేశారు. ఎంపీ మాధవ్ తన పదవికి రాజీనామా చేయాలని నినాదాలు చేశారు. గోరంట్ల మాధవ్ గౌరవప్రదమైన హోదాలో ఉండి సభ్య సమాజం తల దించుకునేలా అతని చర్యలు ఉన్నాయని , అతనిపైన కేసు నమోదు చేయాలని శ్రీ సత్య సాయి జిల్లా అడిషనల్ ఎస్పి రామకృష్ణ ప్రసాద్ కు విన్నవించారు. మాజీ హ్యూమన్ రైట్స్ కమిషన్ మెంబరు పర్వీన్ భానుతో పాటు పలువురు నాయకులు ఈ సంఘటనపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదిలా ఉంటే ఎంపీ మాధవ్ ఇంటి వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎంపీ మాధవ్ ను బర్తరఫ్ చేయాలంటూ చంద్రదండు రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాష్ నాయుుడు ఆందోళనకు దిగారు. ఎంపీ మాధవ్ ఇంటి వద్దకు వెళ్తున్న తరుణంలో పోలీసులు ఆయన్ను అడ్డుకుని అరెస్ట్ చేశారు. అదే సమయంలో ఎంపీ మాధవ్ అనుచరులు కూడా ఇంటి వద్దకు చేరుకోవడంపై మరింత టెన్షన్ రేపింది. ఎంపీ మాధవ్ ను బలహీనం చేయడానికి ఉద్దేశ్యపూర్వంగా ఇలాంటి మార్ఫింగ్ వీడియోలు తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కురుబలను అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు…

మరోవైపు న్యూడ్ ఎంపీ మాధవ్ చేసిన వ్యాఖ్యలు కులాలకు పాకింది. టీడీపీ నేతలు, కొందరు కమ్మ కులస్థులు నాపై ఇలా కుట్ర చేశారన్న కామెంట్స్ దుమారమే రేపాయి. దీనిపై కమ్మ సంఘం నాయకులు అనంతపురంలోని కమ్మ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టారు. కమ్మ కులాన్ని ప్రతిసారి టార్గెట్ చేస్తున్న మాధవ్ క్షమాపణ చెప్పి తీరాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారన్నారు. అదే సమయంలో టీడీపీ కురుబ సంఘం నాయకులు కూడా మాధవ్ తీరుపై మండిపడ్డారు. నువ్వు చేసిన తప్పు మొత్తం కులానికే చెడ్డపేరు తెచ్చిందన్నారు. ఎక్కడినుంచే వస్తే తాము ఆదరించామని.. నువ్ చేసిన పనికి మొత్తమంతా తలదించుకోవాల్సి వస్తోందన్నారు. ఇప్పటికైనా చేసిన తప్పు ఒప్పుకుని రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు…

ఇలా జిల్లా వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. మాధవ్ ఇంటి వద్ద కూడా పోలీసులు ఫోర్స్ పెంచారు. రేపు కూడా ఈ నిరసన కార్యక్రమాలు కొనసాగించాలని.. మాధవ్ రాజీనామా చేసే వరకు వెనక్కు తగ్గేది లేదని స్పష్టం చేశారు.

Doctors Talk: వైద్యరంగంలో నేనో చిన్న చీమను.. ఏనుగులేం చేస్తున్నాయ్?