Site icon NTV Telugu

Vijayawada: ఆటో డ్రైవర్ నిజాయితీ.. ప్రయాణికురాలి నగలు బ్యాగు అప్పగింత

Auto Driver

Auto Driver

ఓ ఆటో డ్రైవ‌ర్ నిజాయితీని చాటుకున్నాడు. తన ఆటో ఓ మహిళా మరిచిపోయిన ఎనిమిది లక్షల విలువైన ఆభరణాలను బ్యాగ్‌ను తిరిగి అప్పగించి ప్రశంసలు అందుకున్నాడు. వివరాలు.. బెజవాడకు చెందిన ఈ ఆటో డ్రైవర్ పేరు పొలవరపు నాగేశ్వరరావు. ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం విజయవాడలోని తన బంధువుల పెళ్లికి వెళ్తున్న నవీన అనే వివాహిత నాగేశ్వరావు ఆటో ఎక్కింది. ఆమె చేతిలో నెలల చిన్నారి కూడా ఉంది. ఆటో ఎక్కిన అనంతరం నవీన తన పాపకు పాలు పట్టించింది. ఈ క్రమంలో సీట్లో బ్యాగును పక్కన పెట్టింది. పాపకు పాలు పట్టిన ఆమె తన గమ్యం రాగానే దిగిపోయి.. నగల బ్యాగు సంగతే మరచిపోయింది.

Also Read: Nitish Kumar : ఎన్టీయే నుంచి వైదొలగనున్న నితీశ్ కుమార్.. ప్రధాని అభ్యర్థి ఆయనే ?

అది చూసుకోని డ్రైవర్ నాగేశ్వరరావు కూడా ఇంటికి వెళ్లిపోయాడు. ఇక ఉదయాన్నే ఆటో తూడుస్తుండగా ఆటోలో బ్యాగ్‌ను గుర్తించాడు నాగేశ్వరరావు. అందులో పెళ్లికి సంబంధించిన విలువైన వస్త్రాలతో పాటు ఎనిమిది లక్షల విలువైన ఆభరణాలు ఉన్నాయి. అవి చూసి అత్యాశకు పోకుండా.. తన నిజాయితీని చూపించాడు. అది నవీన బ్యాగుగా గుర్తించి తిరిగి ఆమెకు అప్పగించాడు. ఎలా ఉన్న బ్యాగ్‌ అలాగే తిరిగి ఇవ్వడంతో నవీన సంతోషించింది. ఈ విషయం తెలిసి తోటీ ఆటో డ్రైవర్లు నాగేశ్వరరావు నిజాయితీని కొనియాడుతూ ప్రశంసలు కురిపించారు. అంతేకాకుండా ఆటో సంఘం కూడా నాగేశ్వరరావు అభినందించింది.

Also Read: Prakasam: దారుణం.. మద్యం మత్తులో వృద్ధురాలిపై ముగ్గురు యువకులు అత్యాచారం

Exit mobile version