అమరావతి రైతుల యాత్రపై స్పందించిన హోంమంత్రి తానేటి వనిత.. సంచలన ఆరోపణలు చేశారు.. రైతుల ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారులు చేస్తున్న యాత్రగా అభివర్ణించిన ఆమె.. రైతుల పేరుతో టీడీపీ నాయకులు చేస్తున్న యాత్రను ప్రజలు తిరస్కరిస్తున్నారని తెలిపారు.. అమరావతిలో భూములు కొనుగోలు చేసిన టీడీపీ నాయకులే యాత్ర చేస్తున్నారని విమర్శించిన హోం మంత్రి… యాత్ర చేస్తున్న వారు ఎక్కడికి వెళ్లినా ఉద్దేశపూర్వకంగా గొడవలు సృష్టిస్తున్నారని.. ప్రజలను, పోలీసులను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు.. పచ్చ మీడియాలో పబ్లిసిటీ కోసమే అమరావతి యాత్ర సాగుతోందన్న ఆరోపించిన ఆమె.. పరిపాలన వికేంద్రీకరణతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మూడు రాజధానుల ఏర్పాటుకు కట్టుబడి ఉన్నారని గుర్తు చేసిన హోంమంత్రి.. రాష్ట్ర ప్రజలందరూ మూడు రాజధానుల ఏర్పాటును స్వాగతిస్తున్నట్లు తెలిపారు.
Read Also: YS Jagan: మరో ఏడాదిన్నరలో ఎన్నికలు.. ఈ రోజు నుంచే సిద్ధం కావాలి…
కాగా, అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ అమరావతి రైతులు రెండో విడత పాదయాత్ర నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.. వెంకటపాలెం గ్రామంలో వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించి, స్వామివారి రథాన్ని ముందుకు నడిపి పాదయాత్రను ప్రారంభించిన రైతులు.. రెండో విడతలో అమరావతి నుంచి శ్రీకాకుళం జిల్లా అరసవల్లి వరకు దాదాపు వెయ్యి కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.. మరోవైపు.. వికేంద్రీకరణ ముద్దు.. మూడు రాజధానులు ఏర్పాటు చేయాల్సిందేనంటూ.. అమరావతి రైతుల పాదయాత్రకు వ్యతిరేకంగా.. జేఏసీ విశాఖ గర్జనకు సిద్ధమైంది.