Site icon NTV Telugu

Minister Anitha: ప్రజలు జాగ్రత్తగా ఉండండి.. రాబోయే 12 గంటల్లో భారీ వర్షాలు..

Anitha

Anitha

Minister Anitha: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం వల్ల రాబోయే 12 గంటల్లోపు వాయుగుండంగా బలపడనున్న నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం హై అలెర్ట్ అయింది. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తా తీరాల వైపు కదులుతూ రాబోయే 12 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో దక్షిణ కోస్తా, రాయలసీమలో అతి భారీ వర్షాల కురిసే అవకాశం ఉండటంతో విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులతో హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత సమీక్ష సమావేశం నిర్వహించింది.

Read Also: Tension in Rajayyapeta: అనకాపల్లి జిల్లా రాజయ్యపేటలో హైటెన్షన్..

ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ.. బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది, ప్రజలు అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయరాదు అని సూచించారు. సహయక చర్యలకు NDRF, SDRF, పోలీస్, ఫైర్ సిబ్బంది సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. జిల్లాల్లో కంట్రోల్ రూమ్స్ 24/7 అలెర్ట్ గా ఉండాలని అన్నారు. ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని తెలిపింది. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చూడాలి.. వాతావరణ పరిస్థితులపై ప్రజలకు ఎప్పటికప్పుడు హెచ్చరిక మెసేజ్లు పంపాలని అన్నారు. సహయం కోసం 24 గంటలు అందుబాటులో ఉండే టోల్ ఫ్రీ నెంబర్లు 112, 1070, 18004250101 సంప్రదించాలి.. ప్రజలు సురక్షితంగా ఉండాలని హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించింది.

Exit mobile version