Site icon NTV Telugu

ప్రభుత్వ జీవో కూడా లోకేష్‌కు పలకరాదు: ఎంపీ గోరంట్ల మాధ‌వ్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ పై హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నారా లోకేష్‌ను ఏక వ‌చ‌నం తో పిలుస్తూ వ్యక్తిగత విమర్శలు చేశారు. ప్రభుత్వ జీవోను కూడా నారా లోకేష్‌ పలకరాదన్నారు. జీవోను నారా లోకేష్ నోరు తిర‌క‌గ జీయో అని అంటాడ‌ని ఎద్దేవా చేశాడు. నారా లోకేష్ కు నోరు తిర‌గ‌క పోతే ఇంట్లో కూర్చోవాల‌ని అన్నాడు. అంతే కాకుండా నారా లోకేష్ తెలుగు రాకపోతే సరిగ్గా తెలుగు భాష నేర్చుకోవాలన్నారు. తెలుగు భాష స‌రిగ్గా రాకుండా ప్రెస్ మీట్లు , ప్రజలలో మీటింగులు పెట్టొద్దన్నాడు.

తెలుగు భాష స‌రిగ్గా రాకుండా ప్రెసె మీట్ లు నిర్వహిస్తూ తెలుగును కూనీ చేస్తున్నాడని విమర్శించారు. తెలుగు ప‌దాలు ప‌ల‌క‌డానికి ఇబ్బంది ప‌డుతున్న టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ నోటిలో పప్పు గుత్తి పెట్టి తిప్పండి అంటూ ఆయన వ్యాఖ్యానించాడు. అయితే టీడీపీ జాతీయ కార్యాల‌యం పై దాడి చేసిన నాటి నుంచి టీడీపీ, వైఎస్ఆర్‌సీపీ నాయకుల మధ్య మాటల యుద్ధం ఇంకా కొనసాగుతూ నే ఉంది. ప్రస్తుతం ఈ మాటల యుద్ధం కాస్త వ్యక్తిగత దూషణలకు దారి తీస్తుంది.

Exit mobile version