NTV Telugu Site icon

Konaseema: అమలాపురంలో యువకుల అరెస్ట్.. 144 సెక్షన్‌ బేఖాతరు

Amalapuram Min

Amalapuram Min

కోనసీమ జిల్లా మార్పు ప్రభుత్వానికి కొత్త తలనొప్పులను తెచ్చిపెట్టింది. కోనసీమ జిల్లా పేరును ప్రభుత్వం ఇటీవల డా.బీఆర్ అంబేద్కర్ జిల్లాగా మార్చడం కొంతమందికి ఆగ్రహాన్ని తెప్పించింది. అయితే కోనసీమ జిల్లాగానే పేరును కొనసాగించాలని మళ్లీ డిమాండ్లు ఊపందుకున్నాయి. దీంతో అమలాపురంలో హైటెన్షన్ నెలకొంది. జిల్లా పేరు మార్పుపై జరిగే ఆందోళనలను దృష్టిలో పెట్టుకుని పోలీసులు 144 సెక్షన్ విధించినా లాభం లేకపోయింది.

Undavalli: ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు.. పోలవరం ఎప్పటికీ పూర్తి కాదు..!

పోలీసులు ఎటువంటి సమావేశాలు, ర్యాలీలు చేయకూడదని 144 సెక్షన్ అమల్లో ఉందని స్పష్టం చేస్తున్నా వినకుండా ఆందోళనకారులు భారీ ఎత్తున ర్యాలీ చేసేందుకు సిద్ధమయ్యారు. కోనసీమ జిల్లా పేరు మార్పును నిరసిస్తూ ముఖ్యంగా యువకులు పెద్ద మొత్తంలో వ్యూహాత్మకంగా నిరసనలకు దిగారు. పెద్ద ఎత్తున అమలాపురం చేరుకుని భారీ ర్యాలీ చేసేందుకు ప్రయత్నించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వీరిని చెల్లాచెదురు చేస్తున్నారు. అమలాపురం ఎక్కడికక్కడ ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట, ఘర్షణ జరగడంతో గుర్తుతెలియని వ్యక్తులు ఎస్పీ వాహనంపై రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో ఎస్పీ, డీఎస్పీ, గన్ మెన్లకు గాయాలైనట్లు సమాచారం అందుతోంది.