ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2014 నుంచి ఏపీలో కొత్త వాహనాలకు రవాణాశాఖ హైసెక్యూరిటీ ప్లేట్లు బిగిస్తోంది. అయితే ఇకపై అన్ని వాహనాలకు హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు తప్పనిసరి చేసింది. పాత వాహనాలకు కూడా హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ల బిగింపు తప్పనిసరి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నంబర్ ప్లేట్ల ద్వారా అదనంగా రూ.500 కోట్ల ఆదాయం ఆర్జించాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది.
రాష్ట్రంలో 1.5 కోట్ల వాహనాలు ఉండగా అందులో సగం వాహనాలకు మాత్రమే హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అంటే 75 లక్షల వాహనాలకు ఇంకా హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్లు బిగించాల్సి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా ప్రభుత్వం తాజా నిర్ణయం ప్రకారం ఇకపై హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్లు లేని వాహనాలకు రూ.వెయ్యి జరిమానా విధించాలని రవాణాశాఖ అధికారులు భావిస్తున్నారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం కూడా పాత వాహనాలకు హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్లు బిగించేలా నిబంధనలను సవరించాలనే ప్రతిపాదనలను పరిశీలిస్తోంది.
Kurnool District: నేరేడు పండ్లు తిని ఇద్దరు చిన్నారులు మృతి.. కారణం ఏంటంటే..?