Duvvada Srinivas: శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలిలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ముందు మూడో రోజు హైడ్రామా కొనసాగుతుంది. దువ్వాడ ఇంటి ముందు రాత్రిపూట కార్ షెడ్ లోనే భార్య వాణి, కుమార్తె హైందవి పడుకున్నారు. తాము ఇంటి నుంచి కదిలేది లేదని దువ్వాడ శ్రీనివాస్ సతీమతి వాణి, కుమార్తె హైందవి తేల్చి చెప్పారు. గత రెండు రోజులుగా దువ్వాడ ఇంటి ముందే భార్యాబిడ్డలు నిరసన తెలుపుతున్నారు.
అయితే, ఎమ్మెల్సీ దువ్వాడ ఇంటి వద్ద మూడో రోజు సైతం దువ్వాడ వాణి, కుమార్తె హైందవి నిరసన దీక్ష కొనసాగిస్తున్నారు. ఇంటి బయట కూర్చొని నిరసన తెలియజేస్తున్నారు. దీంతో దువ్వాడ శ్రీను, భార్య వాణి పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను ఫిర్యాదుతో భార్య దువ్వాడ వాణి, కుమార్తె హైందవితో పాటు మరో ముగ్గురిపై కేసు నమోదు చేసుకోగా.. దువ్వాడ వాణి ఇచ్చిన ఫిర్యాదుతో ఎమ్మెల్సీ శ్రీనివాస్, అతని సోదరుడిపై టెక్కలి పోలీసులు కేసు ఫైల్ చేసుకున్నారు. ఇక, దువ్వాడ శ్రీనివాస్ ఇంటి దగ్గర పోలీస్ పికెటింగ్ కొనసాగుతుంది. దువ్వాడ కుటుంబ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతుంది. డైవర్స్ నోటీసు ఇచ్చేందుకు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సిద్దమౌతుండగా.. ఇల్లు విడిచి బయటకు వెళ్లేందుకు సిద్ధంగా లేమని దువ్వాడ వాణి తెలియజేస్తుంది.