High Court status quo: గుంటూరులో గ్రానైట్ తవ్వకాలపై కీలక ఆదేశాలు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. గ్రానైట్ తవ్వకాలపై స్టేటస్ కో ఆదేశాలు జారీ చేసింది.. గ్రానైట్ తవ్వకాలు నిలిపివేయాలంటూ గుంటూరు జిల్లా చిలకలూరపేటలో మురికిపుడి రైతులు హైకోర్టును ఆశ్రయించారు.. దీనిపై గతంలో విచారణ జరిపి మంత్రి విడదల రజనీ సహా పలువురికి నోటీసులు జారీ చేసింది హైకోర్టు.. ఇక, ఈ రోజు మరోసారి విచారణ చేపట్టిన కోర్టు.. స్టేటస్ కో ఆదేశాలు జారీ చేసింది..
Read Also: CPI Narayana: టీడీపీ, జనసేనతో కలిసే పోటీచేస్తాం..
కాగా, ఈ కేసులో మంత్రి విడదల రజనీ, ఎంపీ అవినాష్ రెడ్డి మామ ప్రతాప్ రెడ్డి, మరదలు స్వేతారెడ్డి, జీవీ దినేష్ రెడ్డి, శివపార్వతులకు నోటీసులు జారీ చేసింది హైకోర్టు.. అయితే, ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన భూముల్లో డీకే పట్టాలు రద్దుచేయకుండా గ్రానైట్ తవ్వకాలకు ఎన్‌వోసీ ఇవ్వడంపై హైకోర్టులో రైతులు పిటిషన్ వేశారు.. ఈ పిటిషన్ తరపున వాదనలు వినిపించారు న్యాయవాది వీవీ లక్ష్మినారాయణ.. మొత్తం 21 ఎకరాల 50 సెంట్లు భూమిలో గ్రానైట్ తవ్వకాలకు ఎన్‌వోసీ ఇచ్చిన ఎమ్మార్వోకు, రైతులు పనులు చేస్తుంటే అడ్డుకున్న ఎస్సైకి కూడా నోటీసులు ఇచ్చింది.. ఒక్కో ఎకరాలో 200 కోట్లు విలువ చేసే గ్రానైట్ నిల్వలు ఉన్నాయని అంచనా ఉండగా.. రైతులకు తెలియకుండానే ఎన్‌వోసీ ఇవ్వడంపై అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి.. ఇక, దీనిపై విచారణ జరిపిన హైకోర్టు, వచ్చేనెల 10 వ తేదీకి కేసు విచారణ వాయిదా వేసింది.. అప్పటి వరకు స్టేటస్ కో ఉత్తర్వులు. కౌంటర్ లు దాఖలు చేయాలని మంత్రి, ఇతరులకు ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు.