Gorantla Madhav Video: హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌కు సంబంధించిన వీడియో వివాదంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ సీబీఐకి ఫిర్యాదు చేశారు. చెన్నై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) సైబర్ క్రైమ్ కార్యాలయానికి ఫిర్యాదుతో కూడిన ఈ-మెయిల్‌ను పంపారు. ఈ ఫిర్యాదుతో పాటు వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌కు సంబంధించిన వీడియో క్లిప్‌లను న్యాయవాది లక్ష్మీనారాయణ జత చేశారు. ఇటీవల వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యలు రెండు ప్రధాన పార్టీల మధ్య వైరాన్ని పెంచే అవకాశం ఉందని, దీంతో రాష్ట్రంలో అశాంతి నెలకొంటుందని న్యాయవాది లక్ష్మీనారాయణ తన ఫిర్యాదులో వాదించారు. ఈ కేసుపై సీబీఐ విచారణ జరిపి నిందితులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
Read Also: Minister Dadisetti Raja: సర్వేల్లో ప్రజల పల్స్ చూసి చంద్రబాబు, పవన్ వణికిపోతున్నారు
అటు ఇటీవల ప్రకంపనలు రేపిన వీడియో ఫేక్ అని వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వాదిస్తున్నారు. కావాలనే ప్రతిపక్షాలు మార్ఫింగ్ చేసి ఈ వీడియోపై రాద్ధాంతం సృష్టిస్తున్నాయని ఆయన మండిపడుతున్నారు. అయితే ఈ వీడియో ఒరిజినల్ అని.. అందులో ఉన్నది గోరంట్ల మాధవ్ అని టీడీపీ వాదిస్తోంది. ఈ వీడియోకు అమెరికాలో ఫోరెన్సిక్ టెస్టు చేయించామని టీడీపీ స్పష్టం చేస్తోంది. మరోవైపు ఈ వీడియో వ్యవహారం కమ్మ వర్సెస్ కురుబగా మారి కులాల మధ్య చిచ్చుపెడుతోంది. బీసీ కులానికి చెందిన ఎంపీ ఎదిగితే ఒర్చుకోలేకపోతున్నారని కురుబ నేతలు మండిపడుతున్నారు. అటు మాధవ్ పదే పదే కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసుకుంటున్నారని ఆ కులానికి చెందిన పలువురు నేతలు ఫైరవుతున్నారు.
