NTV Telugu Site icon

High Court Judges : విజయనగరంలో నలుగురు న్యాయ‌మూర్తులు పర్యటన

విజయనగరం జిల్లాలో నేడు న‌లుగురు హైకోర్టు న్యాయ‌మూర్తులు పర్యటించనున్నారు. ఏపీ హైకోర్టు న్యాయ‌మూర్తులు జ‌స్టిస్ సి. ప్ర‌వీణ్ కుమార్‌, జ‌స్టిస్ సీహెచ్. మాన‌వేంద్ర‌నాథ్ రాయ్‌, జ‌స్టిస్ చీమ‌ల‌పాటి ర‌వి, త‌ల్లాడ రాజ‌శేఖ‌ర్ లు ప్ర‌త్యేక ప‌ర్యటించనున్నారు. ఈ సందర్భంగా స్థానిక కోర్టు ప్రాంగ‌ణంలో ఏర్పాటు చేసిన వివిధ కార్య‌క్ర‌మాల్లో పాల్గొననున్నారు. బార్ అసోసియేష‌న్ మాజీ అధ్య‌క్షుడు, సీనియ‌ర్ అడ్వ‌కేట్ గేదెల రామ్మోహన్ రావు చిత్రప‌టాన్ని కోర్టు హాలులో న్యాయ‌మూర్తులు ఆవిష్క‌రించనున్నారు. ఇటీవ‌ల హైకోర్టు న్యాయ‌మూర్తులుగా నియ‌మితులైన వారికి సీనియ‌ర్ న్యాయ‌మూర్తుల చేతుల మీదుగా స‌త్కార కార్య‌క్ర‌మం జరుగనుంది. దీంతో పాటు జిల్లా కోర్టుకు మరో నూతన భవనం కోరుతూ ప్రతిపాదనలు పంపించిన నేపథ్యంలో పాత కోర్టు భవనాలను నలుగురు న్యాయమూర్తులు పరిశీలించనున్నారు. న్యాయమూర్తుల పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు.