Site icon NTV Telugu

Balakrishna: నాకు 60 సంవత్సరాలు అంటే వాడికి దబిడి దిబిడే

Nanadmuri Balakrishna

Nanadmuri Balakrishna

Nandamuri Balakrishna: ఏపీ సీఎం జనగ్‌ పై తీవ్రంగా విరుచుకుపడ్డా హీరో బాలకృష్ణ. హిందూపురం సరస్వతీ విద్యా మందిర్ లో ఎమ్మెల్యే బాలకృష్ణ కంప్యూటర్లను పంపిణీ చేసారు. రాయలసీమలో ఉద్యోగాలు లేక నిరుద్యోగులు వలసలు పోతున్నారని మండిపడ్డారు. కొత్త ఉద్యోగాలు నోటిఫికేషన్ రావట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిశ్రమలు రావడం లేదని, ఉన్న పరిశ్రమలు వెళ్లగొడుతున్నారని మండిపడ్డారు బాలయ్య. వైసీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలు కూడా తిరగబడాలని బాలకృష్ణ పిలుపునిచ్చారు. వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే నని.. తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలోకి రాగానే ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు పరిశ్రమలు తీసుకొస్తామని హామీ ఇచ్చారు.

Read also: Hero Sharwanand: గ్రాండ్ గా హీరో శర్వానంద్ నిశ్చితార్థం

ఎవరైనా తనకు 60 సంవత్సరాలు అంటే వాడికి దబిడి దిబిడే అంటూ వార్నింగ్‌ ఇచ్చారు బాలయ్య. సేవా కార్యక్రమాలు చేయాలంటే అధికారంలోనే ఉండాల్సిన అవసరం లేదన్నారు. కాని అభివృద్ధి చేయాలంటే మాత్రం అధికారం ఉండాలని తెలిపారు బాలయ్య. ప్రస్తుతం రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమన్నారు. చదువుకుంటేనే తనను సినిమాల్లోకి రావాలన్నారు ఎన్టీఆర్ అని గుర్తుచేశారు. ఒకవేళ సినిమాల్లో నేను రాణించ లేకపోతే చదువుకున్నా కాబట్టి ఉద్యోగమైనా చేసుకోగలను అంటూ బాలకృష్ణ ధీమా వ్యక్తం చేశారు.
MLC Kavitha: గవర్నర్ తమిళిసైకి కవిత కౌంటర్.. వాటినే మళ్లీ అడిగినందుకు ధన్యవాదాలు

Exit mobile version