Site icon NTV Telugu

Balakrishna:వేషం మార్చి…పెళ్ళిలో బాలయ్య సందడి

హిందూపురం శాసనసభ్యుడు, సినీనటుడు బాలకృష్ణ స్టయిలే వేరు. ఆయన ఎక్కడున్నా, ఎవరితో మాట్లాడినా, ఏం చేసినా హాట్ టాపిక్ అవుతుంది. తాజాగా తన స్వంత నియోజకవర్గం హిందూపురంలో పర్యటించిన బాలయ్య సెంట్రాఫ్ అట్రాక్షన్ అయ్యారు. ఓ మైనారిటీ నేత ఇంట్లో జరిగిన వివాహ వేడుకకు హాజరై సందడి చేశారు. సంప్రదాయ ముస్లిం వ్యక్తిలా ఆయన వేషం మార్చేశారు.

https://ntvtelugu.com/tammineni-sitaram-comments-on-2024-assembly-elections/

తమ ఇంట పెళ్ళికి వచ్చిన బాలయ్యకు ఆత్మీయ స్వాగతం పలికారు. హిందూపురానికి చెందిన ఓ టీడీపీ మైనారిటీ నేత ఇంట జరిగిన వివాహ వేడుకకు బాలకృష్ణ హాజరయ్యారు. అచ్చం ముస్లిం వ్యక్తిలా తయారై అక్కడికి వచ్చిన బాలయ్యను చూడడానికి అంతా ఉత్సాహం చూపారు. అఖండ రాకతో అక్కడంతా కోలాహలం, సందడి వాతావరణం నెలకొంది. ఆయన వధూవరులకు ఆశీస్సులు అందించారు. ఈ సందర్భంగా అభిమానులకు, టీడీపీ కార్యకర్తలకు అభివాదం చేశారు.బాలయ్యను ఫోటోలు తీయడానికి అభిమానులు ఉత్సాహం చూపించారు.

Exit mobile version