Site icon NTV Telugu

Weather Update: వాయవ్య బంగాళాఖాతంలో వాయుగుండం.. ఉత్తరాంధ్ర, యానాంలో భారీ వర్షాలు!

Weather Update

Weather Update

Weather Update: వాయవ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. పశ్చిమ బెంగాల్ తీరం డిగాకు సమీపంలో ఈ వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. తీరం దాటిన తర్వాత కూడా మరో 24గంటలు వాయుగుండంగానే ప్రయాణం చేయనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర, యానాంలో పలు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వారు తెలిపారు. భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ఇప్పటికే ఎల్లో బులెటిన్‌ విడుదల చేసింది. వాయుగుండం ప్రభావంతో సముద్రం అలజడిగా ఉంది. ఆది, సోమవారాల్లో మత్స్యకారులు సముద్రంలో చేపలవేటకు వెళ్లవద్దని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం సూచించింది.

Swine Flu Case Detected at Adilabad District: రిమ్స్ లో స్వైన్ ప్లూ కేసు.. అప్రమత్తమైన అధికారులు

దీని ప్రభావంతో ఆదివారం ఉత్తర కోస్తాంధ్రలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శనివారం రాత్రి విడుదల చేసిన నివేదికలో తెలిపింది. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురవవచ్చని పేర్కొంది. మరోవైపు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ మీదుగా పశ్చిమ గాలులు వీస్తున్నాయి. వాయుగుండం ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలో తీరం వెంబడి గంటకు 45–55 కి.మీ., గరిష్టంగా 65 కి.మీ., వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.

Exit mobile version