Tirumala Rush: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయి.. శిలాతోరణం వరకు భక్తులు క్యూ లైన్లలో వేచి ఉన్నారు. ఇక, టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతోంది. అలాగే, నిన్న శ్రీవారిని 80,560 మంది భక్తులు దర్శించుకోగా.. 35,195 మంది తలనీలాలు సమర్పించారు. ఇక, శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.22 కోట్లు వచ్చింది.
Read Also: Astrology: నవంబర్ 9, ఆదివారం దిన ఫలాలు.. ఈ రాశివారికి శుభవార్త..
మరోవైపు, ప్రఖ్యాత పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. సుప్రభాత సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ అధికారులను కలిసి వేద ఆశీర్వాదం తీసుకున్నారు. అలాగే, ఇవాళ తిరుమలలో కార్తీక వన భోజనాలు జరగనున్నాయి. పార్వేట మండపంలో ఉత్సవ మూర్తులకు ప్రత్యేక స్నపన తిరుమంజనం అర్చకులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.