Site icon NTV Telugu

Heavy Rains in Ap: ఏపీలో వర్ష బీభత్సం.. రైతుల గగ్గోలు

Maxresdefault (2)

Maxresdefault (2)

Heavy Rain Alert for AP Live: ఏపీకి భారీ వర్ష సూచన.! | NTV Live

భారీ వర్షాలు కురుస్తుండడంతో నెల్లూరులోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నెల్లూరు నగరంలోని లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన ప్రాంతాలైన మాగుంట లేఔట్ మినీ బైపాస్ . కొండాయపాలెం గేట్.. ఉమ్మారెడ్డి గుంట తదితర ప్రాంతాల్లో జనజీవనానికి తీవ్ర అంతరాయం కలుగుతోంది. కావలి ..ఉదయగిరి.. సూళ్లూరుపేట ..గూడూరు ప్రాంతాల్లో వర్షం ప్రభావం అధికంగా ఉంది. నీటితో
మాగుంట అండర్ బ్రిడ్జి మునిగిపోయింది. దీంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా వానలు పడుతున్నాయి. కావలి.. గూడూరు.. సూళ్లూరుపేట ప్రాంతాల్లో అధికంగా వర్షపాతం నమోదవుతోంది. ఇవాళ కూడా వర్షాలు అధికంగా వుంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలతో అప్రమత్తమైంది జిల్లా యంత్రాంగం. తీరప్రాంత మండలాల అధికారులతో కలెక్టర్ చక్రధర్ బాబు కాన్ఫరెన్స్ నిర్వహించారు. వేట కోసం సముద్రం లోకి వెళ్ళవద్దని మత్స్యకారులకు సూచించారు. గూడూరు డివిజన్ లో ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు..వంకలతో సమీప గ్రామాల వాసులు ఆందోళనకు గురవుతున్నారు.

తిరుపతిలోని సత్యవేడు నియోజకవర్గం వరదయ్యపాలెం మండలంలో భారీ వర్షం పడుతోంది. దీంతో చెరువులు, వాగులు, వంకలు నిండుతున్నాయి. బుచ్చినాయుడు కండ్రిగ సత్యవేడు మండలాల లోని గ్రామీణ ప్రాంతాలలో కూడా భారీ వర్షం కురుస్తోంది. ముఖ్యంగా వరదయ్యపాలెం లో కుండపోతగా పడుతున్న వర్షంతో జనం ఇబ్బందులు పడుతున్నారు.

Exit mobile version