Site icon NTV Telugu

Minister Ravi Kumar: ఏపీలో భారీ వర్షాలు.. విద్యుత్‌ శాఖ అధికారులకు మంత్రి కీలక ఆదేశాలు

Gottipati Ravikumar

Gottipati Ravikumar

Minister Ravi Kumar: విద్యుత్ శాఖ అధికారులతో మంత్రి గొట్టిపాటి రవి కుమార్ సమీక్ష నిర్వహించారు. ఏపీఈపీడీసీఎల్ అధికారులతో వర్చువల్‌గా మంత్రి సమీక్షించారు. అల్పపీడన ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నందున్న అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. వర్ష ప్రభావిత జిల్లాల అధికారులతో మాట్లాడి పరిస్థితులను తెలుసుకున్నారు. విద్యుత్ స్థంభాలు, చెట్లు నెలకొరిగిన ప్రాంతాల్లో సహాయక చర్యలు ప్రాంరంభించాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

Read Also: Heavy Rains: తెలంగాణలోని పది జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్..

లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచనలు చేశారు. లంక గ్రామాల ప్రజలపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి పేర్కొన్నారు. వర్షాలు, వరదలతో ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో వరదలో చిక్కుకున్న ఏలూరు జిల్లా మాదేపల్లి గ్రామస్థులను సురక్షత ప్రాంతానికి అధికారులు తరలించారు.

Exit mobile version