NTV Telugu Site icon

AP Rains: ఏపీకి మూడురోజుల పాటు భారీ వర్ష సూచన..

Ap Rains

Ap Rains

Heavy rains in Andhra Pradesh: ఏపీ రైతులకు బిగ్ అలర్ట్. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడబోతోందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ అల్పపీడన ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ అల్పపీడనం ఈ నెల 25 నాటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని, దీని ప్రభావంతో ఈనెల 27,28,29 తేదీల్లో కోస్తాంధ్ర, రాయలసీమలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

Read also: Visakhapatnam: ప్రేమోన్మాది వేధింపులకు యువ టీచర్ బలి..

మరోవైపు ఏపీలో తుపాను హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వ్యవసాయ పనుల్లో రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ ఎండీ కూర్మనాథ్ అన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అన్ని ప్రాంతాల కలెక్టర్లకు ఆదేశాలు పంపారు. వరి కోతకు వచ్చే సమయం కావడంతో ధాన్యం తడిసిపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వర్షాలు కురిసేందుకు ఇంకా రెండు రోజుల సమయం ఉన్నందున దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది.

Read also: AlluArjun : పుష్ప 2లో ఆ మూడు బ్లాకులు అదిరిపోతాయట

తెలుగు రాష్ట్రాల్లో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. తూర్పు హిందూ మహాసముద్రం, దానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని ఏపీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఆర్గనైజేషన్ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ఈనెల 25న దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా పయనించి అల్పపీడనంగా బలపడే అవకాశం ఉందని.. వాయువ్య దిశగా పయనించి రెండు రోజులు తమిళనాడు-శ్రీలంక తీరం వైపు వెళ్లే అవకాశం ఉందన్నారు.
Rangareddy: బట్టల వ్యాపారికి లేడీవాయిస్‌ తో ట్రాప్‌.. కిడ్నాప్‌ చేసి కోటి డిమాండ్‌..

Show comments