NTV Telugu Site icon

చిత్తూరు జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు..

బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో చిత్తూరులోని 66 మండలాలో వర్షాలు కురిసాయి. 42 మండలాలో 100 మిల్లిమీటర్లు దాటిన వర్షపాతం నమోదు కాగా అత్యధికంగా పెద్దమండ్యంలో 200 మిల్లిమీటర్లు, అత్యల్పంగా పిచ్చాటురు మండలంలో 35 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. అయితే తిరుపతి అర్బన్ లో 100 మిల్లిమీటర్లు, తిరుపతి రూరల్ లో 120 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

భారీ వర్షాలతో కళ్యాణిడ్యాం నిండుకుండలా మారింది. దీంతో కళ్యాణి డ్యాం నుంచి నీటిని అధికారులు విడుదల చేశారు. దీంతో స్వర్ణముఖి నది ఉదృత్తంగా ప్రవహిస్తోంది. చిగురువాడ, పాడిపేట వద్ద వరద నీటితో రోడ్డు కోసుకుపోయింది. తిరుపతి పట్టణంతో గ్రామీణ ప్రాంత ప్రజలు రాకపోకలు తెగిపోయాయి. అంతేకాకుండా వరద ఉదృతికి వసుంధర నగర్, చిగురువాడల్లో ఏకంగా ఇళ్లు కొట్టుకుపోయాయి. వరద నీటితో గాజులమండ్యం వద్ద కాలనీలు జలదిగ్బధంలో చిక్కుకున్నాయి.