Site icon NTV Telugu

Heavy Rains in Andhra Pradesh: ఏపీలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు..

Rains

Rains

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే వర్షాలు దంచికొడుతున్నాయి.. ఆంధ్రప్రదేశ్‌తో పాటు హైదరాబాద్‌ సహా తెలంగాలోని కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి.. అయితే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ చెబుతోంది.. పశ్చిమ మధ్య మరియు ఆనుకుని ఉన్న తూర్పుమధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది… ఇది రానున్న 48 గంటల్లో పశ్చిమ మధ్య మరియు ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం ఉత్తరాంధ్ర – దక్షిణ ఒడిశా తీరాల వెంబడి బలపడుతోందని తెలిపారు ఏపీ విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌.. దీని ప్రభావంతో శనివారం వరకు రాష్ట్రంలో విస్తృతంగా పిడుగులతో కూడిన వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు.. ఇక, కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉంటుందని.. మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లరాని హెచ్చరించారు. మరోవైపు.. తెలంగాణను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి.. హైదరాబాద్‌కు సెప్టెంబర్‌ ముప్పు తప్పుదు అనే తరహాలో.. గత రెండు మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.. మరో రెండు రోజుల పార్టీ భారీ నుంచి అతి భారీ వర్షాలు తెలంగాణలో కురుస్తాయని వాతావరణశాఖ పేర్కొంది.

Read Also: Heavy Rain in Telangana: అలర్ట్‌.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేడు భారీ వర్షాలు..

Exit mobile version